వందలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న అమెజాన్
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వందల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు సమాచారం.
అమెరికాలోని సీటెల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. గత ఏడాది అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,30,000 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. అయితే సీటెల్ ప్రధాన కార్యాలయంలో కొన్ని వందల మందిని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తొలగింపుల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఓ వ్యక్తి వెల్లడించారని కథనాల్లో పేర్కొన్నారు.
అమెజాన్‌లో బాగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల్ని పెంచి, గతంలోని రిటైల్ వ్యాపారంలో ఉద్యోగుల్ని తగ్గించేస్తోంది. అమెజాన్ ఎకో డివైజెస్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, వీడియో, వెబ్ సర్వీసెస్ క్లౌడ్ బిజినెస్ తదితర విభాగాల్లో కొత్తగా ఉద్యోగుల్ని నియమించాలని కంపెనీ భావిస్తోంది. ఏడాది కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో సర్దుబాట్లు
చేస్తున్నామని.. కొన్ని విభాగాల్లో తొలగింపులు, మరికొన్ని విభాగాల్లో నియామకాలు ఉంటాయని అమెజాన్ అధికార ప్రతినిధి ఈమెయిల్ ప్రకటనలో వెల్లడించారు. సీటెల్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వందల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు సమాచారం. అమెరికాలోని సీటెల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. గత ఏడాది అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,30,000 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. అయితే సీటెల్ ప్రధాన కార్యాలయంలో కొన్ని వందల మందిని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తొలగింపుల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఓ వ్యక్తి వెల్లడించారని కథనాల్లో పేర్కొన్నారు.
అమెజాన్‌లో బాగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల్ని పెంచి, గతంలోని రిటైల్ వ్యాపారంలో ఉద్యోగుల్ని తగ్గించేస్తోంది. అమెజాన్ ఎకో డివైజెస్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, వీడియో, వెబ్ సర్వీసెస్ క్లౌడ్ బిజినెస్ తదితర విభాగాల్లో కొత్తగా ఉద్యోగుల్ని నియమించాలని కంపెనీ భావిస్తోంది. ఏడాది కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో సర్దుబాట్లు చేస్తున్నామని.. కొన్ని విభాగాల్లో తొలగింపులు, మరికొన్ని విభాగాల్లో నియామకాలు ఉంటాయని అమెజాన్ అధికార ప్రతినిధి ఈమెయిల్ ప్రకటనలో వెల్లడించారు. తొలగింపునకు గురయ్యే ఉద్యోగులకు తాము నియామకాలు చేపట్టే విభాగాల్లో అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.తొలగింపునకు గురయ్యే ఉద్యోగులకు తాము నియామకాలు చేపట్టే విభాగాల్లో అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

No comments:
Post a Comment