అమ్మేసి ఊరుకుంటే.. ముప్పే!
వాహన యాజమాన్య హక్కుల బదలాయింపు కీలకం
నిర్లక్ష్యం వహిస్తే కొత్త సమస్యలు
మీ పాత వాహనం విక్రయిస్తున్నారా? వెంటనే యాజమాన్య హక్కులను కొన్నవారికి బదలాయించండి... లేదంటే ఇబ్బందులు పొంచి ఉన్నట్లే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇకనైనా అప్రమత్తం కావాల్సిందే. ప్రమాదం జరిగితే ...వాహనం ఎవరి పేరుతో ఉంటే వారే బాధితులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో యాజమాన్య హక్కుల బదలాయింపులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ...ఇరుకున పడ్డట్టే. ఇంతేకాదు... రహదారి నిబంధనల ఉల్లంఘన కేసులు... భారీ స్థాయిలో జరిమానాలు చెల్లించాల్సి రావడం వంటి అవస్థలూ తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గ్రేటర్‌లో వాహనాల మారు వ్యాపారం(సెకండ్ హ్యాండ్) భారీ స్థాయిలో జరుగుతోంది. ఏటా రూ.వందల కోట్ల మేర సాగుతున్న ఈ వ్యాపారంపై అటు రవాణాశాఖ ఇటు పోలీసు నిఘా పెద్దగా ఉండకపోవడంతో చిత్తానుసారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాలను అమ్మేసి తమ పని అయిపోయిందని చాలామంది చేతులు దులుపుకొంటున్నారు. సరైన అవగాహన లేక విక్రయిస్తున్న వారు...కొంటున్న వారు ఇద్దరూ ఇబ్బందులు ఇరుక్కొంటున్నారు. యాజమాన్య హక్కులు మారకపోవడంతో కొన్నవారు.. కొన్నిసార్లు వాహనాలను వదులుకునే పరిస్థితితోపాటు .. అమ్మినవారు కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడుతోంది. రవాణా వాహనాల విషయంలో ఈ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ ఎటొచ్చి కార్లు, ఆటోలు, ద్విచక్ర తదితర రవాణేతర వాహనాల విషయంలో బదిలీ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. నగరంలోని ఆర్టీఏ, పోలీసులకు కార్యాలయాలకు ఇలాంటి వివాదాలతో వస్తున్న వాహనదారుల సంఖ్య ఇటీవలే పెరుగుతోంది.
నిర్లక్ష్యం తగదు...
నగరంలో సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారానికి పెట్టింది పేరు రాంకోఠి. ఇక్కడ చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. కొందరు దొంగ వాహనమైతే ఎలాంటి పత్రాలు లేకపోయినా తక్కువకు కొనేస్తున్నారు. తర్వాత ఇంకొకరికి అంటగడుతున్నారు. మరికొందరు పకడ్ బందీగా వాహనదారు నుంచి పత్రాలు తీసుకొంటున్నా...కొనేవారి పేరుతో బదిలీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా అసలు వాహన యజమాని ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు ఇదో తలనొప్పి వ్యవహారంలా మారింది. అసలు యజమాని పేరుతో ట్రాఫిక్ చలానాలు వెళుతుండటంతో వారంతా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడో తాము వాహనాలు అమ్మేశామని... సంబంధిత పత్రాలూ వారికి ఇచ్చామని... చలనాలు తమపేరుతో వస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఇలాంటి చలానాలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

కొత్తది కొంటే అదనపు బాదుడు!
పాత వాహనం అమ్మేసిన తర్వాత బదిలీ చేయకుంటే.. కొత్తది కొందామంటే పన్నుల రూపేణా అదనపు బాదుడు తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా బైక్‌కు 9 శాతం, కారు అయితే 12 శాతం ఆర్టీఏకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. రెండో వాహనం అయితే బైక్‌కు 5 శాతం, కారుకు 2 శాతం అదనంగా చెల్లించాలి. ఇలా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్లక్ష్యంతో కొందరు...అవగాహన లేక మరికొందరు దీని గురించి పట్టించుకోవడం లేదు. బేరం వచ్చింది కదా...అని అమ్మేసి కొత్త వాటిని కొంటున్నారు. రాజధానిలో నిత్యం 1000 నుంచి 1200 వాహనాలు కొత్తగా రహదారులపైకి వస్తున్నాయి. ఇందులో 20 శాతం మంది ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవస్థీకృతంగా జరుగుతున్న వాహనాల మారు వ్యాపారులపై ఇప్పటివరకు ఎలాంటి నిఘా లేదు. చాలా మంది రికార్డులే నిర్వహించడం లేదు. పకడ్బందీగా పత్రాలు తీసుకోవడం లేదు. యజమాన్య హక్కుల బదిలీ అనేది వాహన అసలు యజమాని విధి. వారూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

నేర ప్రవృత్తి ఉంటే...ప్రమాదమే..
ఇదంతా ఒక ఎత్తైతే...యాజమాన్య హక్కులు బదిలీ చేయకపోతే చేయని నేరాలకు బాధ్యత వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి దానిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగిస్తే... అసలు యజమానులు ఇరుక్కొంటున్నారు. ఒకవేళ బాంబుల వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలతో వాహనం పేల్చినా సరే చాసెస్ నంబరు ఆధారంగా యజమాని ఎవరనేది గుర్తించే వీలుంది. గతంలో ఉప్పల్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. చిలుకానగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బైక్‌ను పొగొట్టుకున్నాడు. వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత అదే బైక్‌తో ఓ దొంగ చైన్‌స్నానింగ్‌కు పాల్పడి...సంఘటన స్థలంలోనే బైక్ వదిలి పారిపోయాడు. బండి నంబరు ఆధారం పోలీసులు కూపీ లాగితే అసలు యజమాని పేరు బయటకు వచ్చింది. అప్పటికే తన బైక్ దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో నేరం నుంచి తప్పుకోగలిగాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

హక్కుల బదిలీ చాలా సులువే...
పాత వాహనం విక్రయించిన తర్వాత హక్కుల బదిలీ చాలా సులువే. అమ్మిన వ్యక్తి ఫారం 29, 30లను నింపి సంతకం చేసి..ఒరిజినల్ ఆర్‌సీ, బీమా, కాలుష్య, చిరునామాల ధ్రువీకరణలు జత చేసి కొనుగోలుదారు వివరాలతో సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో అందజేయాలి. ఇందుకు నిర్ణీత రుసుం చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కరోజులో కొనుగోలు చేసిన వ్యక్తి పేరుతో వాహనం బదిలీ అయిపోతుంది. ఇందుకు ఆన్‌లైన్‌లో తొలుత స్లాట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ వాహనం బాగా తుప్పుపట్టి అమ్మడానికి వీలు లేకపోయినా...ఆర్టీఏ అధికారుల అనుమతితో దానిని ధ్వంసం చేసే వెసులుబాటు ఉంది. ఆ వాహనం మనుగడలో లేదని ధ్రువీకరణ జారీ చేస్తారు. అనంతరం కొత్త వాహనం కొన్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు.

No comments:
Post a Comment