Wednesday, 7 February 2018

భారత్‌ దాడి.. పాకిస్తాన్‌ గుండెల్లో రైళ్లు..!

భారత్‌ దాడి.. పాకిస్తాన్‌ గుండెల్లో రైళ్లు..!


న్యూఢిల్లీ : చైనా పాకిస్తాన్‌ ఎకానమిక్‌ కారిడార్‌(సీపీఈసీ) నిర్మాణాలపై భారత్‌ దాడి చేస్తుందేమోనని పాకిస్తాన్‌ భయపడుతోంది. ఈ మేరకు గిల్గిత్‌ బాల్టిస్తాన్‌లోని ప్రభుత్వానికి పాకిస్తాన్‌ కేంద్ర హోం శాఖ మంత్రి లేఖ రాసినట్లు ఆ దేశ జాతీయ పత్రిక ఒకటి పేర్కొంది.
గిల్గిత్‌లోని సీపీఈసీ నిర్మాణాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పింది. భారత్‌ 400 మంది ముస్లిం యువతకు ఆప్ఘనిస్తాన్‌లో సీపీఈసీ మార్గంలో దాడి చేసేందుకు ట్రైనింగ్‌ ఇస్తోందని కూడా లేఖలో ఉన్నట్లు తెలిపింది. కారాకోరం పర్వత శ్రేణి వద్ద గల బ్రిడ్జి కూడా భారత్‌ ఎంచుకున్న లక్ష్యాల్లో ఉందని చెప్పింది. 
సీపీఈసీ ప్రాజెక్టు కశ్మీర్‌లో అంతర్భాగమైన గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ నుంచి వెళ్తుండటంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించిన చైనా గత వారం సీపీఈసీపై చర్చలకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment