వాహన సురక్ష
థర్డ్‌పార్టీ బీమా.. ఆదుకునే హస్తం
థర్డ్‌పార్టీ బీమా.. ఆదుకునే హస్తం
థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ గురించి చాలాసార్లు విన్నాం. దీని ఉపయోగాలేంటి? ఇది ఎందుకు అవసరం?
మామూలుగా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువే. టూవీలర్స్‌కి వందల్లో, నాలుగు చక్రాల వాహనానికి మూడు, నాలుగు వేల రూపాయలు మించదు. కానీ కొందరు డబ్బులు మిగుల్చుకునే ఉద్దేశంతో తక్కువ ప్రీమియం ఉన్న పాలసీ ఎంచుకుంటారు. ఇది సబబు కాదు. ఏదైనా ప్రమాదం జరిగి వస్తువులకు నష్టం జరిగితే బీమా కంపెనీల చట్టం నిర్దేశించినట్టుగా ఇలాంటి పాలసీలకు కేవలం ఆరువేల రూపాయలు మాత్రమే పరిహారం దక్కుతుంది. మిగతా నష్టాన్ని వాహనదారే భరించాలి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ద్విచక్రవాహనదారులు యాభై నుంచి అరవైశాతం, నాలుగు చక్రాల వాహనదారులు ముప్పై నుంచి నలభైశాతం బీమా లేకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. పైగా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చేయించినట్లైతే మన కారణంగా ఎవరైనా ప్రమాదానికి గురైతే, చనిపోతే బీమా పరిహారం అందడంతో వారి కుటుంబాన్ని ఆ రకంగానైనా ఆదుకున్నామనే సంతృప్తి మిగులుతుంది.

No comments:
Post a Comment