Monday, 12 February 2018

కనుసైగతో.. ఏ మాయ చేసావే! అంతర్జాలంలో మలయాళ నటి ప్రియ హల్‌చల్‌

కనుసైగతో.. ఏ మాయ చేసావే! 
అంతర్జాలంలో మలయాళ నటి ప్రియ హల్‌చల్‌ 

హైదరాబాద్‌: ఎందరో సినీనటులు వస్తుంటారు. పోతుంటారు. కానీ కొందరే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేస్తారు. దీనికి కొందరు సినిమా నిడివి.. అంటే 2.15 గంటలు తీసుకుంటే మరికొందరు జీవితాంతం కష్టపడుతుంటారు. అయితే జీవితానికి సరిపడా క్రేజ్‌ను 27 సెకన్ల వీడియోతో కొల్లగొడితే... అవును.. ఇది సాధ్యమేనని మలయాళ మద్దుగుమ్మ ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ నిరూపించింది. అది కూడా ఎలాంటి మాటలు లేకుండానే. ‘‘ఒరు అదార్‌ లవ్‌’’ సినిమాలోని మణిక్య మలరాయ పాటలో కనుసైగలతో ఆమె పలికించిన హావభావాలు మాటలకు అందనివి. ఇవి  ఆమెకు అమాంతం స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టాయి. యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇలా అన్ని సామాజిక అనుసంధాన వేదికలూ ఆమె పేరు జపించేలా చేశాయి. రెండు రోజుల్లోనే 45 లక్షల మందిని ఈ వీడియోను వీక్షించారు. యూ-ట్యూబ్‌లో మొదటి స్థానంలో ఇది ట్రెండ్‌ అవుతోంది. ఊహించని రీతిలో వస్తున్న ఈ స్పందనకు ప్రియ తబ్బిబ్బవుతోంది. త్రిస్సూర్‌లో ఆమె డిగ్రీ చదువుకుంది. శాస్త్రీయ నృత్యం మోహినియాట్టంలోనూ ఆమె శిక్షణ తీసుకుంది. ‘‘ఒరు అదార్‌ లవ్‌’’ సినిమాతోనే ఆమె తెరంగేట్రం చేస్తోంది.

No comments:

Post a Comment