పార్శిల్‌లో పౌడర్... మత్తులోకి ట్రంప్ కోడలు
వాషింగ్టన్: అమెరికాలో కవర్ బాంబ్ కలకలం సృష్టించింది
. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోడలిపై పౌడర్ దాడి జరిగింది. అస్వస్థతకు గురైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోడలు వానెస్సాకు పార్శిల్‌లో వచ్చిన పౌడర్ కలకలం సృష్టించింది.
కవర్ తెరవగానే తెల్లని పౌడర్ ఆమెపై పడింది. దీంతో వానెస్సా అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు తలతిరగడం, వికారంగా అనిపిండచంతో హుటాహుటిన న్యూయార్క్‌లోని ఆస్పత్రికి తరలించారు.
వెనెస్సాతో పాటు ఆమె తల్లి, మరో వ్యక్తిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పేరిట ఈ కవర్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. అధ్యక్షుడి కుమారుడి ఇంటికి ఇలాంటి అనుమానాస్పద పార్సిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్యాకెట్‌పై బోస్టన్ పోస్ట్‌మార్క్ ఉంది. ఈ ఘటనతో అధ్యక్షుడిని, ఆయన కుటుంబసభ్యులను రక్షించే అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఘటనపై విచారణ చేపట్టారు.

No comments:
Post a Comment