Sunday, 11 February 2018

నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు

నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు
                                     అమలాపాల్‌

నృత్య పాఠశాల యజమాని అళగేశన్‌ తనతో వ్యాపారం చేయాలని అనుకున్నాడని కథానాయిక అమలాపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి ‘డ్యాన్సింగ్‌ తమిళచ్చి’ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో టీ నగర్‌లోని నృత్య పాఠశాలలో శిక్షణ తీసుకుంటున్నానని, అక్కడ పాఠశాల నిర్వాహకుడైన అళగేశన్‌ వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కథానాయకుడు విశాల్‌ అమలాపాల్‌ను ప్రశంసించారు. ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసినందుకు హ్యాట్సాఫ్‌ చెప్పారు. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి నిజంగా చాలా తెగింపు ఉండాలన్నారు. దీనిపై అమలాపాల్‌ తాజాగా స్పందించారు. మీటూ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేస్తూ తనకు మద్దతు తెలిపిన విశాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
‘నా తరఫున మాట్లాడినందుకు ధన్యవాదాలు విశాల్‌. ఇది ప్రతి మహిళ బాధ్యతగా భావిస్తున్నా. వేధింపులపై మౌనం వహించి, వదిలివేయడం సరికాదని నాకు తెలిసేలా చేశావు. ఆయన (నిందితుడు) నాతో వ్యాపారం చేయాలి అనుకున్నాడు. ఆయనకు ఉన్న గుర్తింపు, ఆయన చేసే పనులు చూసి చాలా భయపడిపోయా’ అని అమలాపాల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

No comments:

Post a Comment