న్యూఢిల్లీ: సాధారణంగా హిందీపై అవగాహన లేని భారతీయులు ఆ భాషను నేర్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రాష్ర్టాల్లో జాతీయ భాష హిందీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోగా అంతగా అవగాహన ఉండదు. కానీ ఓ విదేశీ పర్యాటకుడు అతి తక్కువ కాలంలోనే హిందీతో పాటు హరియాణ, దిల్లీ రాష్ర్టాల్లో ఎక్కువ మాట్లాడే హరియాన్వి(ఇండో-ఆర్యన్ లాంగ్వేజ్)ను నేర్చుకొని తప్పులు లేకుండా మాట్లాడుతున్న తీరు స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నది. ఆటో డ్రైవర్, దుకాణదారులు, కాలనీల్లో ఉండే చిన్న పిల్లలతో సంభాషించినపుడు అతడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌కు చెందిన కార్ల్ రాక్ ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్థానికులతో పూర్తిస్థాయిలో అర్థవంతంగా మాట్లాడాలంటే వాళ్లు మాట్లాడే భాషపై పట్టుండాలని గ్రహించాడు. అందుకోసం సొంతంగానే లాంగ్వేజ్‌ను నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. ఐతే తనకు ఈ రెండు భాషలను నేర్పింది తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం. ఆమెతో పాటు నా భారత మిత్రులు, యూట్యూబ్ సహకరించిందని కార్ల్ తెలిపాడు. ఫన్నీ వీడియో వీక్షించండి..

No comments:
Post a Comment