Saturday, 24 February 2018

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం సినీ తరహాలో బట్టబయలు చేసిన పోలీసులు ఐదుగురు యువతులు, ముగ్గురు విటుల అరెస్టు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం 
సినీ తరహాలో బట్టబయలు చేసిన పోలీసులు 
ఐదుగురు యువతులు, ముగ్గురు విటుల అరెస్టు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని గుంటూరు అర్బన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న బౌన్స్‌ బ్యూటీ సెలూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని అర్బన్‌ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదులందాయి. దీంతో ఆ సెలూన్‌పై నిఘా పెట్టాలని క్యూఆర్టీ విభాగం ఎస్సై నాగుల్‌మీరాను ఎస్పీ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఎస్సై తమ సిబ్బంది మస్తాన్‌, ప్రవీణ్‌, నాగరాజు, నాగేశ్వరరావు, నాగయ్య, మహిళా కానిస్టేబుల్‌తో కలిసి లక్ష్మీపురానికి చేరుకున్నారు. సెలూన్‌ బయట కొంత మందిని ఉంచి.. ఎస్సై మరో కానిస్టేబుల్‌తో కలిసి సాధారణ వ్యక్తులవలేె లోపకి వెళ్లారు. వారు మీకేమి కావాలంటూ ఓ యువతి పలకరించడంతో వారికి అనుమానం రాకుండా క్రాప్‌ (క్షవరం), కాళ్ల గోర్ల్లు తీయించుకోవడానికి వచ్చామని చెప్పారు. అందుకుగాను రూ.700లు ఖర్చవుతుందని చెప్పడంతో వారు ఆ మొత్తాన్ని చెల్లించారు. క్రాప్‌ చేసే, గోర్లు తీసే సమయంలో అక్కడ జరుగుతున్న తంతుపై రహస్యంగా పర్యవేక్షించారు. ఇంతలో కొంతమంది యువకులు సెలూన్‌ లోపల ఉన్న రహస్య గదుల్లోకి వెళ్లడాన్ని ఎస్‌ఐ పసిగట్టారు. దీంతో అక్కడ ఉన్నవారితో సెలూన్‌లో ఇంకా ఏమేమి సౌకర్యాలు ఉన్నాయంటూ మాటలు కలపడంతో పురుషులకు మహిళలతో మసాజ్‌ చేసే సదుపాయం మా ప్రత్యేకత అంటూ చెప్పారు. అలా మాటామాటా కలిపి అక్కడి రహస్య గదుల్లోకి వచ్చే..వెళ్లే వారి ప్రవర్తన తీరు, యువతులను ఆ గదుల్లోకి పంపిస్తున్న తీరును చూసి వ్యభిచారం జరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు. రహస్య గదుల్లో వాడిపడేసిన నిరోధులు వారి కంటపడ్డాయి. దీంతో సెలూన్‌ లోపల ఉన్న ఎస్సై బయట ఉన్న కానిస్టేబుళ్లకు సంకేతాలు పంపించడంతో అందరూ కలిసి ఒక్కసారిగా సెలూన్‌ లోపల ఉన్న రహస్య గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,500ల నగదు, 11 చరవాణిలు (సెల్ ఫోన్ ) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విజయవాడకు చెందిన సంధ్య, శాంతకుమారి, కృష్ణా జిల్లాకు చెందిన సుకన్య, గుంటూరు నగరాలకు చెందిన లక్ష్మి, మారుతీనగర్‌కు చెందిన మస్తాన్‌బీ, అమరావతి రోడ్డుకు చెందిన ప్రేమ్‌చంద్‌, పశ్చిమ గోదావరి జల్లాకు చెందిన వెంకట సత్యాలరావు, గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన వెంకట నరేష్‌లు ఉన్నట్లు సమాచారం. గుంటూరు నగరం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment