Sunday, 11 February 2018

ట్రస్మా ఆధ్వర్యంలో ఉచిత బస్సు సర్వీసులు


ట్రస్మా ఆధ్వర్యంలో ఉచిత బస్సు సర్వీసులు

నల్గొండ : మహాశివరాత్రి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణం నలుమూలల నుంచి పానగల్‌లోని ఛాయాసోమేశ్వరాలయం వరకు భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మ) ఆధ్వర్యంలో ఉచితంగా బస్సులు నడపటం అభినందనీయమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నల్గొండలోని న్యూస్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో బస్సులకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్సులను మహిళలు, పిల్లలు, వృద్ధులు, భక్తులు వినియోగించుకోవాలని సూచించారు. ఛాయసోమేశ్వరాలయం ఛైర్మన్‌ గంట్ల అనంతరెడి,్డ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈఏడాదీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తెరాస నాయకులు మునాసు వెంకన్న, గంట్ల నర్సిరెడ్డి, వంగాల అనిల్‌రెడ్డి, స్వామిగౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు నీలా వెంకటేశ్వర్లు, మూల శివప్రసాద్‌, కాసర్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment