రైల్వే ఉద్యోగాలు!
దేశవ్యాప్తంగా 62,907 గ్రూప్-డి పోస్టుల్లో చేరే అద్భుత అవకాశాన్ని
భారతీయ రైల్వేశాఖ కల్పిస్తోంది. 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసుండి, పదోతరగతి/ ఐటీఐ/ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ పొందినవారు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. వీటిలో చేరితే రూ.18,000 నెల వేతనంతోపాటు ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి. మొత్తం పోస్టుల్లో 6523 పోస్టులు కేవలం సికింద్రాబాద్ రైల్వడివిజన్‌లో భర్తీ చేయనున్నారు.
ఈ నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత మార్కులు సాధించినవారికి శారీరక దార్ఢ్య పరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. 12.03.2018 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.
* కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షలో 100 ప్రశ్నలను పూర్తి చేయడానికి 90 నిమిషాల సమయాన్ని కేటాయించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40%, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ వారు 30% కనీస అర్హత మార్కులు పొందాలి.
*అరిథ్‌మెటిక్, మేథమేటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కులున్నాయి.

అరిథ్‌మెటిక్, మేథమేటిక్స్
వ్యాపార గణితంలోని ప్రశ్నలు రోజువారీ దినచర్యలో భాగంగా మనం చేసే పనికి వర్తించుకుంటూ ఆలోచిస్తే సమాధానాలు తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. నంబర్ సిస్టమ్స్‌పై అవగాహన పెంచుకుని, ఇంటీజర్లు, భిన్నాలు, డెసిమల్ నంబర్లకు బాడ్‌మాస్, పెడ్‌మాస్ సూత్రాలను అప్లై చేయడం నేర్చుకోవాలి. వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు చేయడం సాధన చేయాలి. కసాగు, గసాభా, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, వ్యాపార భాగస్వామ్యం, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యాలు, ఘన పరిమాణాలకు సన్నద్ధమవ్వాలి. తక్కువ సమయంలో షార్ట్‌కట్ ఫార్ములాలను వాడుతూ సమాధానాలు గుర్తించడం సాధన చేయాలి.
క్యాలెండర్, గడియారాలకు సంబంధించిన ప్రశ్నలనూ సాధన చేయాలి. బీజీయ సమాసం, రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రాలకు సంబంధించిన సమాధానాలను గుర్తించాలంటే ఫార్ములాలను ఉపయోగించడం తెలియాలి. వీటి ఫార్ములాలను ఒక పట్టిక రూపంలో తయారు చేసుకుని, ప్రతిరోజూ 10 నిమిషాలు వెచ్చించాలి. రోజూ ఇలా మననం చేసుకోవడం ద్వారా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు. | |||
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్
|

No comments:
Post a Comment