Sunday, 11 February 2018

కొడుకుని వృద్ధాశ్రమానికి పంపించే తండ్రి

           కొడుకుని వృద్ధాశ్రమానికి పంపించే తండ్రి 

మితాబ్‌ బచ్చన్‌, రిషి కపూర్‌ తండ్రీకొడుకులుగా నటిస్తున్న చిత్రం ‘102 నాట్‌ అవుట్‌’. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది. అందులో అమితాబ్‌, రిషి మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. 102 ఏళ్ల వ్యక్తి 75 ఏళ్ల తన కొడుకుని అపురూపంగా చూసుకుంటుంటాడు. అన్నేళ్లు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడిలానే ఆ కొడుకు ప్రవర్తన ఉంటుంది. కొడుకు కంటే తండ్రే ఇంకా హుషారుగా ఉంటాడు. 102 ఏళ్ల వయసులో సాక్సోఫోన్‌ వాయిస్తుంటాడు. ఫుట్‌బాల్‌ ఆడుతుంటాడు తండ్రి. కొడుకేమో టెన్షన్‌ పడుతూ యోగాసనాలు వేస్తుంటాడు. ‘‘ప్రపంచంలో కొడుకుని వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్న తొలి తండ్రిని నేనేనేమో’’ అని అమితాబ్‌ పలికే సంభాషణ ఆకట్టుకుంటుంది. తండ్రీ కొడుకులు వర్షంలో తడుస్తూ చేసే డ్యాన్స్‌ ఆహ్లాదంగా సాగుతుంది. సౌమ్య జోషి రాసిన గుజరాతీ నాటిక ‘102 నాట్‌ అవుట్‌’ ఆధారంగా తెరకెక్కుతన్న చిత్రమిది. ఉమేష్‌ శుక్లా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమితాబ్‌ మాట్లాడుతూ ‘‘అందరూ యువతరం నటుల సినిమాలే కోరుకుంటారు. అందులో తప్పులేదు. కానీ వాళ్లు అందించిన వినోదం మాలాంటి వయసొచ్చిన నటులు అందివ్వలేరనుకుంటే ఒప్పుకోను. వాళ్లకంటే గొప్పగా మేమూ అలరించగలం’’ అని చెప్పారు అమితాబ్‌ బచ్చన్‌.

No comments:

Post a Comment