మాది క్వీన్స్ కోఠీ..!
కాలేజీకి వెళ్లే రాదారి, అక్కడికి తీసుకెళ్లే బస్సూ, ‘హాయ్’ అంటూ పలకరించే గేటు, ప్రతి తరగతి గది, ఒక్కో చెట్టూ, పుట్టా.. ఇవన్నీ ఎంత పాతవైనా కావొచ్చు. నిత్యం కుర్రతనంతో కువకువలాడుతుంటాయి. కారణం.. మీరు హించిందే!! అవెప్పుడూ యువతుల మధ్యే ఉంటాయికాబట్టి!! మన తెలుగు రాష్ట్రాల్లోని అలాంటి మహిళా కళాశాలల సుల్ని వినిపించే ప్రయత్నం ఇది. నేటి కాలేజీ అమ్మాయిల చిలిపి సరదాలతోపాటూ వారి ప్రతిభా, సమాజంపై వాళ్ల దృక్పథాన్నీ ఇందులో కాస్త కాస్త చూపించాలనుకుంటున్నాం!! కాలేజీల విశిష్టతనీ పరిచయం చేద్దామనుకుంటున్నాం. మేం మీ కాలేజీకీ వచ్చేముందు.. దీనిపై ఓ లుక్కేయండి!!
‘తాజ్‌మహల్ ఓ ప్రేమ చిహ్నమని అందరికీ తెలుసు! అంతకన్నా ఓ గొప్ప ప్రేమ కథకి గుర్తు.. మా కోఠి ఉమెన్స్ కాలేజీ భవనం. నిజాం పాలన కాలమది.
ఆయన పేరు జేమ్స్ అచిలిస్ కిర్క్‌ప్యాట్రిక్. 1798లో ఈస్టిండియా కంపెనీ రాయబారి(రెసిడెంట్ ఆఫీసర్)గా ఆయనిక్కడ ఉండేవారు. యువకుడు.
నాటి నిజాం దివాన్‌గారి మనవరాలు ఖైరున్నిసాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. మరి పెళ్లి చేసుకోవడం సాధ్యమా? మతాలు వేరాయె! మన కిర్క్‌ప్యాట్రిక్ మతం
మార్చుకున్నాడు. ఏదో కంటితుడుపుగా మారడం కాదు.. తన వేషం, భాషా అన్నీ మార్చేశాడు. సిగార్స్ వదిలేసి.. హుక్కా పీల్చడం అలవాటుచేసుకున్నాడు.
పక్కా భారతీయుడై పోయాడు. అలా ఖైరున్నిసాని నిఖా చేసుకున్నాడు. ఆమె కోసం అణువణువునా అందాలొలికేలా.. అతి సుందరమైన మూసీ ఒడ్డున(అప్పట్లోలెండి!)
ఈ భవనం నిర్మించాడు. వీళ్లకిద్దరు పిల్లలు. ప్చ్.. వాళ్ల ఎదుగుదలని చూడకుండానే అనారోగ్యంతో కన్నుమూశాడు కిర్క్‌ప్యాట్రిక్. కిర్క్ చనిపోయినా..
ఆయన ప్రేమ గుర్తుగా నిలిచిపోయింది మా భవనం!! నిజానికి ఈ ప్రాంతానికి ‘కోఠి’(ఉర్దూలో నివాస భవనం అని..) అనే పేరు రావడానికీ ఈ భవంతే కారణం!
మా కాలేజీ 1924లోనే ప్రారంభమైనా ఈ భవనంలోకి 1949లో వచ్చింది. అంతవరకూ సరోజినీ నాయుడుగారి ఇళ్లు గోల్డెన్ త్రెషోల్డ్‌లో ఉండేది..! - అంటూ తమ కాలేజీకి సంబంధించి చక్కటి ఇంట్రో ఇచ్చింది శ్వేతా! శ్వేత చదివేది డిగ్రీ ఇంగ్లిషు లిటరేచరైనా.. చరిత్రంటేనే ప్రాణమట!
అందుకేనేమో ఓ చిన్నసైజు ‘రొమిలా థాపర్’ అనే అంటున్నార్ట లెక్చరర్‌లు. ఆ మధ్య ఆలిండియా హిస్టరీ కాంగ్రెస్‌లోనూ యువ ప్రతినిధిగా పాల్గొని..

కోఠి కాలేజీకి అవార్డు సాధించిపెట్టిందట!!
అట్టాంటి ఇట్టాంటి అడ్డాకాదు..!
ప్రతి కాలేజీలోనూ బాతాఖానీకంటూ ఓ ప్రత్యేక అడ్డా ఉంటుంది. కాలేజీ గేటు దాటగానే ఎదురయ్యే రాతిబల్లా, క్యాంటీన్‌లోని చిట్టచివరి టేబుల్, ఆటమైదానంలో కాస్త గడ్డి నిలిచిన స్థలం.. చదువుల మధ్య ఏ కాస్త ఖాళీ దొరకగానే అమ్మాయిలక్కడ వాలిపోతారు. మరి కోఠి కాలేజీలో అలాంటి అడ్డా ఏమిటీ? క్యాంటిన్ బయటుండే పొగడపూల చెట్టేనంటారు ఇక్కడమ్మాయిలు కోరస్‌గా! లెక్చరర్‌ల స్టాఫ్‌రూమ్‌కి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి.. కొత్త సినిమా కబుర్లు కావొచ్చూ, కాలేజీ గాసిప్స్ అయుండొచ్చు అవన్నీ మొదట ఇక్కడే వినిపిస్తుంటాయి! స్నేహితురాళ్ల సరదా తగాదాలు తీర్చేందుకు ఇదే న్యాయస్థానం! రేపు కాలేజీ ఎలా ఎగ్గొట్టాలో చర్చించేందుకూ ఇదే వ్యూహమందిరం!!

‘నిక్’నామకరణం..!
(ష్.. ఇవన్నీ రహస్యం)
* అనంత శ్రీరామ్‌లు : అక్కయ్యతోపాటూ ఎప్పుడో ఒకసారి బెరుగ్గా ఈ కాలేజీలోకొచ్చే బెదురుచూపుల అబ్బాయిలు!
* ‘స్పామ్’ బాయ్స్ : ఏదో పనుల వంకతో తరచూ వచ్చే రోమియోలు!
* ప్రసాద్.పి : ఇంకా పెళ్లికాని ‘నాన్-టీచింగ్’ స్టాఫ్ అబ్బాయిలు!
* డాటర్ ఆఫ్ సత్యమూర్తి : సదా వాళ్ల నాన్న గొప్పతనాల గురించి దరగొట్టే క్లాస్‌మేట్స్!
* అవం‘తిక్క’: చీటికీమాటికీ సినిమా హీరోయిన్లా.. తెచ్చిపెట్టుకున్న ఎక్స్‌ప్రెషన్‌లు ఇచ్చే అమ్మాయి.
* ఇందుమతి : గత జన్మల గురించి నమ్మకం ఉన్న అమ్మాయిలు(మగధీర ఎఫెక్ట్ మరి!)
* శివగామి : (మనలో మనమాట) క్లాసుకి రాని అమ్మాయిల్ని కొరకొరా చూసే లెక్చరర్(బాహుబలి రమ్యకృష్ణలా!)

స్లామ్ బుక్..!(కాలేజీ వీఐపీల పరిచయం..)
* నిప్పుల చెరిగే శర్వాణీ : ప్రతి ఏడాదీ తన పేరు పత్రికల్లో తళుక్కుమంటుంది. మహిళా క్రికెట్ టీమ్ ఇండియా ‘ఎ’ జట్టు క్రీడాకారిణి. బంతితో నిప్పులు చెరిగే పేసర్. హైదరాబాదీ మిథాలీ రాజే తనకి స్ఫూర్తని చెబుతుంది. ‘బయటకు తెలియదుగానీ ప్రభుత్వ కళాశాలల్లో క్రీడలకి మంచి ప్రోత్సాహం ఉంటుంది. నేనీ స్థాయికొచ్చానంటే కారణం.. ఈ కాలేజీ ప్రాంగణమే!’ అంటుంది శర్వాణీ.
* కథానాయికల గాత్రం : ‘నాన్నకు ప్రేమతో..’ కథానాయిక రకుల్‌ప్రీత్ చిలిపి నటనని ఇప్పట్లో ఎవ్వరం మరిచిపోలేం! మరి తన గొంతుకి సొంతదారు ఎవరో తెలుసా! నీలిమ..! ఆ ఒక్క సినిమానే కాదు ‘నేనూ..శైలజ’ కథానాయిక గొంతుక కూడా తనదే. ‘నాన్న ప్రముఖ డబ్బింగ్ రచయిత. ఎనిమిదేళ్లప్పుడే రికార్డింగ్ స్టూడియోలోకి అడుగుపెట్టా. చిరంజీవి ‘డాడీ’ సినిమాలో ఆ చిన్నపాప గొంతు నాదే!’ అంటుంది నీలిమ. అందుకే మరి.. ఈ కాలేజీలో ఎంత పెద్ద కార్యక్రమం నిర్వహించినా.. తనే శాశ్వత వ్యాఖ్యాత!
* అ.. టెన్షన్ : పెద్దపల్లి పద్మ ఎన్‌సీసీ విద్యార్థినిగా ఈ మధ్యే రిపబ్లిక్ పెరేడ్‌కి ఎంపికైంది! పదేళ్ల తర్వాత ఈ కాలేజీ నుంచి ఆ గుర్తింపు దక్కించుకున్న అమ్మాయి తనే! తనని ఈ కాలేజీ మొత్తం అభిమానించడానికి అదొక్కటే కారణం కాదు మరి. ఇంకేమిటీ? ‘మాది హైదరాబాద్‌లోని నింబోలి అడ్డా. మురికివాడ ప్రాంతం. డిగ్రీ చేరిన మొదట్లో మంచి బట్టలు కూడా వేసుకుని వచ్చేదాన్ని కాదు. ఇక్కడి మా ‘కోఠి క్వీన్స్ గ్రూప్’ అప్పట్లో నన్ను చేరదీసింది. ఐపీఎస్ కావాలనే లక్ష్యాన్ని నాలో నాటింది. నేనెంత సాధించినా.. అదంతా మా గ్రూప్ చలవే!’ అంటుంది పద్మ.
* ఇంతకీ ఏమిటీ గ్రూప్? : కోఠి కాలేజీలో ఎంతోమంది విద్యార్థి వీఐపీలున్నా.. వాళ్లందరూ మెచ్చిన బృందం ‘కోఠి క్వీన్స్ గ్రూప్’. 1990లలో ఈ కాలేజీ మాజీ విద్యార్థిని, నేటి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ దీన్ని ప్రారంభించారు. నిరుపేద యువతుల్ని ఆదుకోవడం.. వాళ్ల కలల సాకారానికి కృషి చేయడమే దీని ఉద్దేశం. ఇప్పుడు ‘మెంటార్’ అనే పదం విరివిగా వినిపిస్తోంది కదా! ఆ సూత్రాన్ని ఈ క్లబ్‌లో ఇరవై ఏళ్లకిందటే ఏర్పాటుచేశారు. కాలేజీలోని 80 శాతం మంది అమ్మాయిలు ఇందులో సభ్యురాళ్లే!

తెలుగు పదానికి..
‘ఈ కాలంలో తెలుగెవరు చదువుకుంటున్నారు? అంతా ఇంగ్లీషే అనుకునేవాళ్లందరూ.. ఒక్కసారి ఈ కళాశాల తెలుగు విభాగాన్ని చూడాలి. ఇక్కడెప్పుడూ 90 శాతం అమ్మాయిల అటెండెన్స్ తగ్గిందిలేదు. ఇందులో కనీసం 50 శాతం మంది ఎంఫిల్‌కి వెళ్లితీరాల్సిందే. హైదరాబాద్‌లోని పత్రికల్లో మహిళా పాత్రికేయులు ఎక్కువమంది ఇక్కడి నుంచి వచ్చినారే! వీళ్లలో చాలామంది సినిమా రచయితలూ అయ్యారు.

అ‘పూర్వం..’
సుమారు 90 ఏళ్ల చరిత్ర ఉన్న కాలేజీ ఇది! హైదరాబాద్ నుంచి జాతీయస్థాయి గుర్తింపు అందుకున్న ఎంతోమంది ఇక్కడి నుంచి వచ్చినవారే! ఇదివరకే చెప్పినట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ, క్రికెటర్ మిథాలీ రాజ్, సెలబ్రిటీ చెఫ్ రుచికా శర్మ, షబనా అజ్మీ, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి.. ఇలా ఈ కాలేజీ పూర్వ విద్యార్థుల్లోని ప్రముఖుల జాబితా చాలా పెద్దది!!

చిట్‌చాట్..
..ఇవండీ కోఠి మహిళా కళాశాల ముచ్చట్లు. ఇన్ని ముచ్చట్లు విన్న ‘వసుంధర’ నేటి విద్యార్థుల ముందు ఓ చిన్న ప్రశ్న వేసింది. దానిపై సరదాగా చర్చించమని చెప్పింది. వాళ్లక్కిచ్చిన అంశం.. ‘పదేళ్ల తర్వాత మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. అప్పుడు ఈ కాలేజీ కోసం ఏం చేస్తారు? ఎందుకూ?’ అని. వాళ్ల సరదా కబుర్లు మీరే వినండి.. ‘కనీసం మా కాలేజీ పొడవునా మూసీ తీరం ఉంటుందండీ! కనీసం ఆ స్ట్రెచ్ వరకైనా శుభ్రం చేయిస్తా. వాటిలో స్విమ్మింగ్‌పూల్‌లూ ఉంటాయి...’ అని రమ్య చెప్పడం మొదలుపెట్టగానే గుమిగూడిన అమ్మాయిలందరూ గొల్లుమన్నారు. ‘మరి అక్కడికి అబ్బాయిలొస్తే..’ అన్నారెవరో వెనక నుంచి. ‘వాళ్లకెలాగూ శుభ్రం చేయని మూసీ ఉందికదా..’ అంటూ ముందుకొచ్చింది రేణు. రావడంతోనే ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ‘గోకుల్ చాట్ మా కాలేజీకి పక్కనే కదా! దాని బ్రాంచి ఒకటి కాలేజీ లోపలా పెట్టిస్తా..’ అని చెప్పింది. ఇందరి నవ్వుల మధ్య చిర్నవ్వుతో వచ్చిన శ్రుతి.. చాలా సీరియస్ విషయం చెప్పింది. ‘మా కాలేజీకి ఆశ్రయం ఇచ్చిన కిర్క్‌ప్యాట్రిక్ నిర్మించిన భవనం శిథిలావస్థలో ఉంది. ఎంతైనా అది ఓ ప్రేమికుడి స్వప్నం. దాన్ని బాగు చేయిస్తా..’ అని చెప్పింది. ఎందుకో అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాసేపే.. మళ్లీ సరదా మాటలు మొదలు.. తెరలు తెరలుగా!

No comments:
Post a Comment