కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సిబ్బంది శాఖ
రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీం చెప్పిందని వెల్లడి
తెలంగాణ పేరు ప్రస్తావనతో గందరగోళం
లేఖలో తెలంగాణ ప్రస్తావన!
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ లేఖలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘తెలంగాణ ప్రభుత్వం’ అని అచ్చు కావటంతో కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును శాసనసభలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇంతవరకు దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి అందలేదు.

తెలంగాణ గురించి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు..
తాజా లేఖ నేపథ్యంలో తెలంగాణలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి కేంద్రం ఆమోదంపైనా అనిశ్చితి నెలకొంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిన లేఖలో కోటా 50 శాతానికి పెంచకూడదన్న సుప్రీం తీర్పునే ప్రస్తావించడం.. రిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక కాదని అభిప్రాయపడడంతో ఇవే నిబంధనలతో తెలంగాణ విన్నపానికి కూడా విఘాతంగా తయారవ్వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు పరచడం.. ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం వంటి అంశాలను కూడా కేంద్రానికి పంపిన లేఖలో వివరించామని తెలంగాణ అధికార వర్గాలు చెప్పాయి. ఈ లేఖలోని విషయాలను తెలంగాణ అధికారులు దిల్లీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర అధికారులను, ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం.

No comments:
Post a Comment