భీకర శబ్దానికి బెంబేలు
ఉనికి చాటుకుంటున్న తేనె కుక్క
కావేరి వన్యధామంలో అరుదైన అతిథి
అత్యంత అరుదుగా కనిపిస్తూ..అరుపులతో దాదాపు 30 కి.మీ.ల మేర దద్దరిల్లే భీకరమైన శబ్దాలు చేసే అరుదైన జీవి హనీ బ్యాడ్జర్ (తేనె కుక్క). ప్రస్తుతం కావేరి వన్యధామంలో సంచరిస్తోంది. ఈ జీవి సంచారం వన్యజీవి అధ్యయనకర్తలకు, అటవీ శాఖకు ఒకింత ఉత్సాహం నింపింది. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రియా అడవుల్లోనే గుర్తించిన ఈ జీవి ప్రస్తుతం కర్ణాటకలో కనువిందు చేస్తోంది. రెండేళ్ల క్రితం మల మహదేశ్వర, హలగూరు పరిసరాల్లోని బసవన బెట్ట కొండల్లో మాత్రమే కనిపించిన చిన్నపాటి ఎలుగుబంటిని పోలినట్టుండే తేనె కుక్క ఇటీవలి కాలంలో కావేరి వన్య ధామంలో కనిపించింది. ఈ జీవి సంచారంతో రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత పెంచినట్లయిందని అటవీ శాఖ ప్రకటించింది. ఇంతకీ అరుదుగా చెప్పుకొనే ఈ జీవి ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం.

పులి, సింహాల్ని కూడా అడ్డుకునే తెగువ
చూసేందుకు చిన్నపాటి ఎలుగుబంటి, పెద్దగా ఉండే ముంగిసలా కనిపిస్తుంది. నడకలో కుక్కను పోలి ఉంటుంది. వీపుపై తెల్లని ఛాయలుండే నల్లని ఈ జీవి చూసేందుకు భీతి గొలిపేలా ఉంటుంది. తాను నివసించే పరిసరాల నుంచి ఆడ జీవి అయితే గరిష్ఠంగా 10 కి.మీ.లు, మగ జంతువైతే 30 కి.మీ.ల వరకు సంచరించగలదు. విష సర్పాలను ప్రధాన ఆహారంగా తినే ఈ జీవి కలుగులో ఉన్న కొండ ఎలుకల్ని ఎంతో ఇష్టంగా తింటుందని ప్రముఖ వన్యజీవి పరిరక్షకులు సంజయ్ గుబ్పి చెబుతున్నారు. మాంసాహారి అయిన ఈ జంతువుకు పులి, చిరుత, సింహాలను సైతం తన అరుపులు, భయంకరమైన సంజ్ఞలతో నిలువరించే సత్తా ఉందని ఆయన తెలిపారు. నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు దీన్ని చూడగానే దారి తప్పుకొని వెళ్తాయి. నేలపై ఆహారం అందని సమయంలో చెట్లపై ఉండే తేనె తుట్టెల్ని తింటూ జీవనం సాగిస్తుంది.

లాంఛనంగా కూడా..
ఈ జంతువు సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు కావేరి వన్య ధామానికి ఇదే జీవి చిత్రంతో లాంఛనాన్ని తయారు చేశారు. తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉండి మనుగడ కోసం పోరాడే జీవుల గురించి ఆలోచన మొదలు పెట్టారు. ఈ జీవి సంతతిని మరింత పెంచుతూ వాటిని పరిరక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కావేరి ఆర్‌ఎఫ్‌ఓ రమేష్ రాజు చెప్పారు. ఈ జీవుల జీవన విధానాన్ని మరింత సునిశితంగా పరిశీలించి వాటి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నాం. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు అటవీ ప్రాంతాల్లోనే కనిపించే ఈ జీవి అనధికారికంగా ఎన్ని చోట్ల ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉందన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ సహకారంతో దేశ వ్యాప్తంగా చేపట్టే సమీక్షల్లో ప్రస్తుతం కావేరి వన్యధామంతో పాటు మల మహదేశ్వర కొండలను చేర్చి ఈ జీవి వివరాలు సేకరిస్తామన్నారు.

No comments:
Post a Comment