వృథా నుంచి అదిరే దుస్తులు..
కుర్తా... చొక్కా... లెహెంగా... అనార్కలీ... ఇలా ఏవి కుట్టినా.. ఎంతో కొంత వస్త్రం వృథా అయి చెత్తలోకి వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే భారత్, చైనా, బంగ్లాదేశ్ కలిపి... దుస్తులు తయారు చేసే కంపెనీలన్నింటి నుంచీ ఏటా దాదాపు 80 బిలియన్ చదరపు మీటర్ల వస్త్రం వృథాగా మారుతోందట. ఇదంతా బయట చెత్త కుప్పలా పేరుకుపోయేదే. ఆ చెత్తనే మళ్లీ డిజైను చేసి ఏకంగా ఒక కొత్త బ్రాండ్ సృష్టించింది కృతీ తుల. అంతేనా... ఆ దుస్తులను ల్యాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ ప్రదర్శించింది. వ్యాపార శిశువుగా ఉన్న తన సంస్థ అక్కడిదాకా చేరడానికి ఆమె చేసిన ప్రయాణం, ప్రయత్నం గురించి ఇలా చెప్పుకొచ్చింది.
పెద్ద పెద్ద సంస్థలు ప్రింట్లలో చిన్న తప్పులు దొర్లాయనీ, లేదంటే చిన్న రంధ్రాలున్నాయని 0.09 శాతం, కటింగుల్లో తేడాలొచ్చి 16.37 శాతం వస్త్రాన్ని పక్కన పెట్టేస్తాయి. దాంతోపాటే కొత్తగా ఆర్డర్లు రావచ్చని అవసరానికి మించి 5-10 శాతం అదనంగా దుస్తుల్ని సిద్ధం చేసుకుంటారు. ఒకవేళ ఆ ఆర్డరు రాకపోతే అవి నిరుపయోగమే. ఇంతకముందు కొన్ని ప్రింటింగ్ యూనిట్లలో, వస్త్ర పరిశ్రమల్లో ఉద్యోగం చేసినప్పుడు ఇదంతా ప్రత్యక్షంగా చూశా. ఒక షర్ట్ కుట్టాలంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటాం. కానీ మనకు కావల్సింది కట్‌షర్ట్. అంటే దాదాపు మొత్తం వస్త్రం పరిమాణంలో ఇరవై శాతం అక్కడే వృథా అవుతుంది. అలాంటి షర్టులు రోజుకు లెక్కలేనన్ని తయారుచేస్తారు. ఇవే నా వ్యాపార ఆలోచనకు ఊతమిచ్చాయి. మాది దిల్లీ. పైగా నా చదువులు కూడా డిజైనింగ్‌కు సంబంధించినవే కావడంతో ఈ రంగంలోకి రావడం సులువైంది. నేను వేసుకున్న ఆ లెక్కలూ, పర్యావరణానికి మేలు చేయాలనే ఆలోచనలు.. నన్ను ఇటువైపు నడిపించాయి.

మళ్లీ చదివా...
ఆలోచన రాగానే సరిపోదు. దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఏ కంపెనీలకు వెళ్లాలి...? నా ఆలోచన ఎవరికి చెప్పాలన్న విషయం మొదట్లో నాకొక చిక్కుముడి. 2012లో నేను బ్రాండ్ పేరును డూడ్‌లేజ్‌గా రిజిస్టర్ చేయించా. కానీ.. నా పనులేవీ అంత సులువుగా మొదలుకాలేదు. కంపెనీలకు వెళ్లి.. మీ దగ్గర మిగిలిపోయిన వస్త్రం ఇవ్వమంటే సులువుగా ఇచ్చేయరు కదా.. వాళ్లకి నా ఆలోచన గురించి చెప్పి ఒప్పించడం పెద్ద సమస్యే. కానీ, కొన్ని రోజులకు నా ఆలోచన అర్థమై మంచి స్పందనే వచ్చింది. అయితే, వృథా దుస్తులు సేకరించినా కూడా... ఎలాంటి డిజైన్‌లు తయారు చేయాలీ... అతుకుల బొంతలా కాకుండా ఆధునికంగా, ట్రెండీగా ఉండేలా కనిపించాలంటే ఎలా డిజైను చేయాలి.. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించేదాన్ని. వాటన్నింటికీ పరిష్కారం దొరకడానికి నాకు ఏకంగా రెండు సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా డిజైనింగ్‌లోనే ఎంఏ పూర్తి చేసేశా. 2014 కల్లా... చిన్న స్థాయి పరిశ్రమల నుంచి వృథాగా ఉన్న వస్త్రాల్ని సేకరించడం మొదలుపెట్టా. ఇప్పుడు మా దగ్గరున్న దుస్తుల్లో తొంభైశాతం అలా సేకరించిన వాటి నుంచి తయారైనవే. ఇక వీటిని మార్కెటింగ్ చేయడం మరో సమస్య. మొదట్లో తక్కువ సంఖ్యలో దుస్తులు తయారుచేయడంతో ప్రత్యేకంగా ఒక దుకాణం అయితే ప్రారంభించలేం. అందుకే దగ్గర్లో ఉన్న బ్రాండ్ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకున్నా. అక్కడ ఒక్కసారి కొనుగోలు చేసిన వాళ్లు... మా బ్రాండ్ దుస్తుల గురించి మళ్లీ అడిగేవారు. దాంతో ఆర్డర్లు ఎక్కువగా రావడం మొదలైంది. ఇలా క్రమంగా చాలా నగరాల్లో బ్రాండ్ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం విస్తరించా. ఇప్పుడు దేశం మొత్తం దాదాపు నలభై స్టోర్లలో మా దుస్తులు అమ్ముతున్నాం. హైదరాబాద్‌లోనూ అనానిమ్, ఓగాన్, తామర, ది ప్రాజెక్ట్ లాంటి స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.

వాటినీ ఉపయోగిస్తున్నాం...
మేం సేకరించిన వృథా నుంచి దుస్తులు తయారుచేశాక కూడా చాలా వస్త్రమే వృథా అయ్యేది. దాన్నలా వదిలేస్తే నేను అనుకున్న లక్ష్యం మధ్యలో మిగిలిపోయినట్లే. అందుకే అలా మిగిలిన వాటితో బ్యాగులూ, యాక్సెసరీలూ, స్టేషనరీ తయారుచేస్తున్నాం. ఒక్కటని కాదు.. ఏం చేయడానికి వీలుంటే అది తయారు చేయడమే నా, నాతో పనిచేసే వారి లక్ష్యంగా మారింది. మొదట్లో కేవలం అమ్మాయిల దుస్తులే తయారుచేసేవాళ్లం. ఇప్పుడు అబ్బాయిల కోసం కూడా ప్రత్యేక శ్రేణిని అందుబాటులో ఉంచుతున్నాం. చాలా సంస్థలు పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. సహజ రంగులు వాడటం, కాటన్‌కు ప్రత్యామ్నాయాలు కనుక్కోవడం, తొందరగా భూమిలో కలిసిపోయే వస్త్రావిష్కరణలు... ఇలా చాలా చేస్తున్నాయి. పూర్తిగా వృథా అనుకున్న వస్త్రాల ముక్కల నుంచి దుస్తులు తయారుచేస్తున్నది మాత్రం కొందరే. ఇదొక్కటే కాదు అరటీ, వెదురు పీచుతో తయారుచేసిన వస్త్రాన్నే ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం.

ఎలా చేస్తామంటే...
మా దగ్గరికి పెద్ద మొత్తంలో ముడిసరుకు వచ్చి చేరుతుంది. వాటి నుంచి కాస్త ఒకే రకం, రంగులో ఉన్న వస్త్రాల్ని ఎంచుకోవడం కష్టమైన పనే. వాటిని ఎంపిక చేశాక ఎలాంటి డిజైను రూపొందించొచ్చనేది చర్చిస్తాం. అవసరమైన వాటికి ఎంబ్రాయిడరీలూ, ప్యాచ్‌లు చేయిస్తాం. మేం తయారు చేసే ఏ రెండు డ్రెస్సులు ఒకే రకంగా ఉండవు. అందుకే నా సంస్థ పేరు డూడ్‌లేజ్ అని ఎంపిక చేశా. మామూలుగా ఏ రెండు డూడుల్స్ ఒకేలా ఉండవు. కానీ వేటి ప్రత్యేకత వాటిదే. ఇదే మేం తయారుచేసే దుస్తులకూ వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లోనూ వీటిని అందుబాటులో ఉంచితే ఎక్కువ మందిని చేరుకోవచ్చనే ఆలోచనతో ఈ మధ్యే వెబ్సైట్‌ను కూడా ప్రారంభించా. 1400 రూపాయల నుంచి 14000 రూపాయల వరకు యాక్సెసరీలూ, దుస్తులు అందుబాటులో ఉన్నాయి.

మా నాన్న బ్లేజర్‌తో మొదలు...
లాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ మా దుస్తులను ప్రదర్శించే అవకాశం నాకు అనుకోకుండా వచ్చింది. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. నా కష్టానికి వచ్చిన గుర్తింపది. నా ప్రయాణం మా నాన్నకు చాలా ఇష్టమైన ఒక లెదర్ బ్లేజర్‌తో ప్రారంభమైంది. అది ఆయన దాదాపు పది సంవత్సరాల నుంచి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ఇప్పుడాయనకు అది నప్పక.. వేసుకోలేక చాలా బాధ పడేవారు. దాన్ని నేను జాకెట్‌గా మార్చేసి వేసుకున్నా. అదే నేను మార్చిన మొదటి డ్రెస్. భవిష్యత్తులో ఒక వెడ్డింగ్ డ్రెస్ కూడా ఇలా మిగిలిన వస్త్రంతో తయారు చేయాలనేది నా కోరిక..!

No comments:
Post a Comment