Thursday, 8 February 2018

ఆ వంటకాలకు శ్రీదేవి సినిమాల పేర్లు! ఓ అభిమాని విన్నూత్న ఆలోచన

చెన్నై: అలనాటి నటి శ్రీదేవిని ఆరాధించే అభిమానుల సంఖ్య ఇప్పటికీ తక్కువేం కాదు. ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేసిన ‘అతిలోక సుందరి’కి ఇప్పటికీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తగ్గలేదు. మొన్నటికి మొన్న చెన్నైకి చెందిన ఓ వ్యక్తి శ్రీదేవి పేరిట యాక్టింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తు్న్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు.
ఇప్పుడు చెన్నైకి చెందిన మరో అభిమాని ఆమె పేరిట ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నాడు. ఇందులో తయారుచేసే దాదాపు వంద రకాల వంటకాలకు శ్రీదేవి నటించిన సినిమాల పేర్లు పెట్టబోతున్నాడట. ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాల్సిందిగా శ్రీదేవికి చెప్పమని ఆమె మేనేజర్‌ను కోరాడట. రెస్టారెంట్‌ గేట్‌ వద్ద శ్రీదేవి పోస్టర్‌ను కూడా డిజైన్‌ చేయించాడు. అయితే ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి శ్రీదేవి ఒప్పుకున్నారా? లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఆఖరిగా ‘మామ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీదేవి ఇప్పుడు తన పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. జాన్వి ‘ధడక్‌’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘సైరాట్‌’ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది. శశాంక్‌ ఖైతాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి జాన్వి ‘జూనియర్‌ అతిలోకసుందరి’ అన్న పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి

No comments:

Post a Comment