కేప్‌టౌన్ దాహాకారం
తాగునీటికి తీవ్ర కటకట
పోలీసు భద్రత నడుమ సరఫరా
త్వరలో పూర్తిగా ఆగిపోతాయా
దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద, ఆధునిక నగరం కేప్‌టౌన్ ఇప్పుడు కనీవినీ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాలన్నీ దాదాపుగా అడుగంటిపోయాయి. మే నెల 11 వ తేదీ లోపే నీటి సరఫరా పూర్తిగా ఆగిపోతుందని(డే జీరో) ప్రమాద హెచ్చరికలు వెలువడుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో తీవ్ర అసహనం ఏర్పడి... పెద్దఎత్తున ఘర్షణలు జరగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు భద్రతతో.. ప్రజలకు రేషన్ ప్రకారం నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి కుళాయి వద్ద చాంతాడు లాంటి క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 25 లీటర్ల నీటితోనే తాగడం, స్నానం, మరుగుదొడ్లకు, చేతులు కడుక్కోవడం అన్నింటికీ సరిపెట్టుకోవాలి. ఆసుపత్రులు, క్లినిక్‌లు, పాఠశాలలకు మాత్రం నీటి రేషన్ నుంచి మినహాయించారు.
శాంతిభద్రతల సమస్య
నీటి సమస్య తీవ్రం కావడంతో నగరంలో అక్కడక్కడా శాంతిభద్రతలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అన్ని నీటి సేకరణ పాయింట్లు, కుళాయిల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటుచేశారు. అత్యంత అసమానతలు కలిగిన దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. హత్యలు, దొంగతనాలకు కేప్‌టౌన్ పెట్టిందిపేరు. దీంతో అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. నీరు పూర్తిగా ఆగిపోయే రోజు వస్తే కేప్‌టౌన్ అల్లకల్లోలమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో నీటి సేకరణ పాయింట్ వద్ద 20వేల మంది వరకు నీటిని పట్టుకుంటున్నారు. అక్కడికి ఇకపై జనం పోటెత్తడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అప్పుడు అక్కడ పోలీసులు, సైన్యాన్ని మోహరించక తప్పదు. సంపన్నులు తమ ఇళ్లలో భారీ నీటి నిల్వ ట్యాంకుల్ని ఏర్పాటుచేసుకున్నారు. పేదలకు అలా చేసుకోలేరు కాబట్టి ఆందోళనలు ఉద్ధృతరూపం దాల్చవచ్చంటున్నారు.
తాగునీటికి తీవ్ర కటకట
పోలీసు భద్రత నడుమ సరఫరా
త్వరలో పూర్తిగా ఆగిపోతాయా
దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద, ఆధునిక నగరం కేప్‌టౌన్ ఇప్పుడు కనీవినీ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాలన్నీ దాదాపుగా అడుగంటిపోయాయి. మే నెల 11 వ తేదీ లోపే నీటి సరఫరా పూర్తిగా ఆగిపోతుందని(డే జీరో) ప్రమాద హెచ్చరికలు వెలువడుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో తీవ్ర అసహనం ఏర్పడి... పెద్దఎత్తున ఘర్షణలు జరగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు భద్రతతో.. ప్రజలకు రేషన్ ప్రకారం నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి కుళాయి వద్ద చాంతాడు లాంటి క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 25 లీటర్ల నీటితోనే తాగడం, స్నానం, మరుగుదొడ్లకు, చేతులు కడుక్కోవడం అన్నింటికీ సరిపెట్టుకోవాలి. ఆసుపత్రులు, క్లినిక్‌లు, పాఠశాలలకు మాత్రం నీటి రేషన్ నుంచి మినహాయించారు.
కేప్‌టౌన్ జనాభా - దాదాపు 40 లక్షలు
రోజువారీ నీటి వినియోగం - 75 కోట్ల లీటర్లు
నగరంలో నీటి సేకరణ పాయింట్లు- 200
ప్రస్తుతం ఒక్కొక్కరికి రోజుకు నీటి సరఫరా - 25 లీటర్లు

ఎందుకీ నీటి సంక్షోభం?
కేప్‌టౌన్‌లో ఇంతటి నీటి సంక్షోభం తలెత్తడానికి కారణాలు అనేకం.
* చుట్టూ అట్లాంటిక్ మహా సముద్రం ఉన్న కేప్‌టౌన్ తీవ్ర వర్షాభావ ప్రాంతం. ఇక్కడ చలికాలంలో వర్షాలు కురుస్తాయి. వర్షపాతం సాధారణం కంటే 25 శాతం తక్కువ ఎల్‌నినో కారణంగా 2015లో ఇక్కడ తీవ్ర కరవు వచ్చింది. 400 ఏళ్లలో ఎన్నడూ చవిచూడనంతటి కరవు అది. వాతావరణ మార్పులు దీనికి కారణం. ఆ తర్వాత మూడేళ్లుగా దుర్భిక్షం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వర్షాల్లేక జలాశయాలు ఎండిపోయాయి.
* ఆధునికతకు పెట్టింది పేరైన, పర్యాటకులకు స్వర్గధామమైన ఈ నగరంలో నీటి వినియోగం, వృథా రెండూ ఎక్కువే.
* ఈ నగరంలో కొన్నేళ్ల కిందటి దాకా ఆధునిక నీటి సంరక్షణ పద్ధతులు పాటించేవారు. నెమ్మదిగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చి.. నీటి లీకేజీలను అరికట్టడం కూడా మానేశారు. నగరానికి సరఫరా అయ్యే నీటిలో 30 నుంచి 40 శాతం దాకా పైపుల లీకేజీ ద్వారానే వృథాగా పోతోందని అంచనా.
* ఇటీవల కాలంలో నగర జనాభా విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగా నీటి సరఫరా లేదు.
* నగరంలోని కొందరు సంపన్నులు నీటిని యథేచ్ఛగా వృథాచేయడం ఒక ప్రధాన కారణం.
* శుద్ధిచేసిన సముద్రపు నీరు, భూగర్భ జలాలు వాడటం లాంటివి ఈ నగరంలో చాలా తక్కువ. దాదాపు 99 శాతం నీటిని వర్షాధారమైన జలాశయాల నుంచే తీసుకుంటారు. మూడేళ్లుగా ఇవి ఎండిపోవడంతో పరిస్థితి తల్లకిందులైంది.
* ఈ సంక్షోభం వెనుక రాజకీయ కారణాలూ ఉన్నాయి. కేప్‌టౌన్, అందులో భాగమైన వెస్టర్న్ కేప్ ప్రావిన్సును డెమోక్రటిక్ అలయెన్స్ అనే పార్టీ పాలిస్తోంది. దక్షిణాఫ్రికా జాతీయ స్థాయిలో మాత్రం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ) అధికారంలో ఉంది. నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో స్థానిక ప్రభుత్వంతో కలిసి పనిచేయకుండా, నీటి సరఫరాలో సహకరించకుండా ఏఎన్‌సీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పూర్తిగా ఆగిపోయే రోజు దగ్గర్లోనే...
నీరు పూర్తిగా ఆగిపోయే రోజు(డే జీరో) అతి దగ్గర్లోనే ఉందన్న వార్తలు అధికారులు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జలాశయాల్లో అతికొద్దిగా మిగిలిఉన్న నీరు 13.5 శాతం మేర ఖాళీ అయిపోతే... ఇక నగర నీటి సరఫరాకు పూర్తిగా తెరపడినట్లే!! అది ఏప్రిల్ మధ్య నుంచి మే 11 లోపు జరగొచ్చని అంటున్నారు. ఇప్పటికే కేప్‌టౌన్ చుట్టుపక్కల వ్యవసాయానికి నీటిని పూర్తిగా ఆపేశారు. నగరంలో నీటి వృథా, అతి వినియోగం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. పరిమితికి మించి నీటిని వినియోగించే వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెల నుంచే.. ఒకరు 87 లీటర్లకు మించి నీటిని వాడకూడదని పరిమితి విధించారు. అయినప్పటికీ.. ఎక్కువగానే వినియోగిస్తుండడంతో.. ఇప్పుడు దానిని 25 లీటర్లకు కుదించారు.

No comments:
Post a Comment