చాహల్.. కళ్లజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు?
భారత మణికట్టు మాంత్రికుడు చాహల్ ఈ మధ్య మైదానంలో కళ్ల జోడు పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న సమయంలో పెట్టుకోని చాహల్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మాత్రమే కళ్ల జోడు ధరిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమిటి? చాహల్‌కు ఏమైఉంటుంది? అన్న అనుమానాలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.
స్టైల్‌గా కనిపించేందుకు కళ్ల జోడు పెట్టుకుంటున్నాడంటూ పలువురు నెట్టింట్లో కామెంట్లు పెట్టారు.
ఐతే.. దీనిపై చాహల్ తండ్రి వివరణ ఇచ్చారు. చాహల్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు కంటికి సంబంధించిన వైద్యులను సంప్రదించాడు. వారు అప్పుడప్పుడు కళ్లజోడు ధరించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు చాహల్ కళ్లజోడు ధరిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేసే సమయంలో కాకుండా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పెట్టుకుంటున్నాడు. త్వరలో చాహల్ ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇందులో భాగంగానే కంటి పరీక్షలు చేయించుకున్నాడు’ అని చాహల్ తండ్రి తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన అనంతరం చాహల్ దిల్లీలో ఐటీ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఆయన చెప్పారు.
సఫారీ గడ్డపై భారత పర్యటన ఈ నెల 24తో ముగియనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం రెండో టీ20 జరగనుంది.
No comments:
Post a Comment