‘నేను అనసూయ గార్డియన్‌ను కాదు’
స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ ఓ బాలుడి చేతిలో ఫోన్ పగలగొట్టిందని, దుర్బాషలాడిందని బాధిత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఓ నెటిజన్ రష్మికి ట్విట్ చేశాడు. ‘అనసూయకు పబ్లిక్‌తో ఎలా ఉండాలో చెప్పు నేర్చుకుంటుంది అని ఆ ట్విట్‌లో పేర్కొన్నాడు. దీనికి సమాధానంగా రష్మీ‘ నేను ఆమె గార్డియన్‌ను కాదు’ అని ట్విట్ చేసింది. అంతేకాక ఆమె నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చారు రష్మ.
‘నేను చెప్పను. నన్ను తిడతారు అంతే కదా. మీతో నేను ఒక సన్నివేశాన్ని చెప్పలనుకుంటున్నాను. నేను షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బైక్‌లపై నలుగురు యువకులు మా కారును ఫాలో అయ్యారు. వారిని తప్పించడానికి మా డ్రైవర్ ప్రయత్నించాడు. వారు అలానే వెంబడించారు. చివరికి నేను కారును ఆపించాను. ఆ యువకులు మాకు సెల్ఫీ ఇస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని గట్టిగా అడిగారు. మా టైం బాగుండి అదే సమయంలో అటువైపుగా పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. పోలీసులు మాకు హెల్ఫ్ చేశారు. అయితే ఆ సమయంలో నేను స్పాట్ లో వారు వెళ్లిపోవడానికి అనుమతి ఇచ్చి ఉంటే మీరు మరోలా మాట్లాడేవారు. అందుకే ఆ యువకులను పోలీసులకు అప్పగించాను. వారి లైఫ్‌ను నాశనం చేయాలని నేను అనుకోలేదు.’ అని వరుస ట్విట్స్ రష్మీ చేసింది.

No comments:
Post a Comment