త్వరలో క్రిప్టో కరెన్సీలపై నిబంధనలు..!
త్వరలో క్రిప్టోకరెన్సీలపై నిబంధనలు ప్రకటించనున్నట్లు సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. నేడు ఆయన మాట్లాడుతూ బిట్‌కాయిన్ల ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటుండటంతో పెట్టుబడిదారులను రక్షించేందుకు త్వరలోనే నిబంధనలను వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే పలు నిబంధనలపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట సమర్పించిన మర్నాడే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఆఫైర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో నివేదిక ఇచ్చే విధంగా పూర్తిగా కృషి చేస్తున్నామన్నారు. క్రిప్టో కరెన్సీలపై ఏర్పాటు చేసిన కమిటీలో అజయ్ త్యాగి కూడా సభ్యుడే. ఈ కమిటీ క్రిప్టో కరెన్సీల లాభనష్టాలను వివరిస్తుంది. దీంతో పాటు ప్రభుత్వమే క్రిప్టో కరెన్సీ తయారీపై సాధ్యాసాధ్యాలను వివరిస్తుంది. దీనిపై ప్రభుత్వ పాలసీ వెల్లడయ్యాక దానిలో సెబీ పాత్ర ఏమిటో బయటకు వస్తుందని త్యాగి తెలిపారు.
No comments:
Post a Comment