Tuesday, 6 February 2018

కనిపించని కరెన్సీతో కోట్లు గల్లంతు


  • మదుపరులను ముంచేసిన బిట్‌కాయిన్‌
  • పలు దేశాల ఆంక్షలతో విలువ పతనం
  • భారత్‌లోనూ భారీగా అక్రమార్కుల పెట్టుబడి
  • గుర్తించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు
  • లాభాలు గడించిన వారికి నోటీసులు
  • నాలుగో త్రైమాసిక వసూళ్లపై భారీ అంచనాలు
  • సాధారణ మదుపరుల్లో తగ్గుతున్న ఆసక్తి

క్రిఎ్టో కరెన్సీ విలువ వేగంగా పడిపోతోంది. మంగళవారం లగ్జం బర్గ్‌లోని బిట్‌స్టాంప్‌ ఎక్సేంజ్‌లో బిట్‌కాయిన్‌ ధర సుమారు 6వేల డాలర్లకు పతనమైంది. మూడు మాసాల క్రితం దీని విలువ 20వేల డాలర్లకు పైగానే పలికింది. డిసెంబర్‌లో కూడా ఇది 19,940 డాలర్ల విలువ పొందింది. కేవలం రెండుమాసాల్లోనే మూడింట ఒకవంతుకు బిట్‌ కాయిన్‌ విలువ దిగజారడంతో అంత ర్జాతీయంగా లక్షలాదిమంది క్రిఎ్టో కరెన్సీ మదుపుదార్లు మిలియన్ల డాలర్ల విలువైన సంపదన కోల్పోయారు. క్రిఎ్టో కరెన్సీ గత కొంత కాలంగా సమాంతర నగదుమారకంగా అభివృద్ది చెందుతోంది. పలు దేశాల అధికారిక కరెన్సీకంటే కూడా క్రిఎ్టో కరెన్సీకి విలువ పెరిగింది. ప్రపంచ ఆర్థికరంగంలో ఇదో పోటీదారుగా అవతరిం చింది. దీంతో ఇప్పుడు బిట్‌కాయిన్‌పై పలుదేశాలు రకరకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఇదే ట్రేడింగ్‌లో దీని విలువ పతనం కావడానికి కారణ మైంది. బ్రిటన్‌, అమెరికాలో అయితే క్రెడిట్‌ కార్డుల ద్వారా బిట్‌కాయిన్‌ల మారకం పై నిషేదం విధించారు. తాజా కేంద్ర బడ్జెట్‌లోను భారత్‌ బిట్‌ కాయిన్‌ను అనుమతించేది లేదంటూ తేల్చేసింది. ఇలాంటి చర్యల్తో ఇప్పుడు సమాంతర కరెన్సీ భవిష్యత్‌ డోలాయమానంలో పడింది. రోజు రోజుకు దీని విలువ తగ్గుతోంది. ఇదే వారంలో కాయిన్‌ విలువ ఐదువేల డాల ర్లకు కూడా పతనమయ్యే అవకాశాలున్నట్లు ట్రేడింగ్‌ నిపుణులు తేల్చేశారు. దీంతో బిట్‌కాయిన్‌ల మదుపుదార్లు వీలైనంత తొంద రగా వీటిని విక్రయిం చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా వేగం గా విలువ దిగజారడానికి దోహదపడుతున్నాయి. బిట్‌ కాయిన్‌.. ఇలాగే పది రకాల వర్చువల్‌ కరెన్సీ ఇప్పు డు ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉంది. ఇది ఫిజికల్‌గా ఎవరికీ కనిపించదు. ఇది ఏ దేశానికి చెందింది కూడా కాదు. ఇది కేవలం డిజిటల్‌ కరెన్సీ మాత్రమే. ఇంటర్‌నెట్‌ ద్వారానే దీని క్రయవిక్రయాలు, మార్పులు జరుగుతాయి. నెట్‌ ద్వారానే దీని చెల్లుబాటు చేయగలుగుతాం. దీన్నే క్రిఎ్టో కరెన్సీగా కూడా పిలుస్తారు. ఈ పదింటిలోనూ అత్యధికంగా ప్రాచుర్యం పొందింది బిట్‌కరెన్సీయే. దీన్ని కంప్యూ టర్‌ పరిభాషలోనే లెక్కిస్తారు. కంప్యూటర్‌లో ప్రతిదాన్ని బిట్‌లు, బైట్‌లలోనే కొలుస్తారు. ఎనిమిది బిట్‌లు కలిస్తే ఒకబైట్‌. అంటే ఒక అక్షరం లేదా సంఖ్య లేదా ఒకసారి కీ బోర్డ్‌లో మీటనొక్కడం. అందులో ఎనిమిదో వంతును బిట్‌గా పిలుస్తారు. ఇది మొత్తం కంప్యూటర్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ సహాయంతో జరిగే ట్రేడింగ్‌ కావడంతో దీనికి బిట్‌కాయిన్‌గా పేరెట్టారు. ఇదిప్పుడిప్పుడే భారత్‌లో ప్రాచుర్యం పొందింది. కానీ 2008లోనే దీన్ని సతోషినకమొటో అనే కంప్యూటర్‌ ఇంజనీర్‌ తయారు చేశారు. ఆ ఏడాది ఆగస్టు 18న బిట్‌ కాయిన్‌. ఓఆర్‌జి పేరిట ఓ వెబ్‌సైట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఆదిలో ఈ వెబ్‌సైట్‌కు పెద్దగా ఆదరణుండేదికాదు. ఇందులో బిట్‌కాయిన్‌ను కూడా ఎవరూ పట్టించుకునేవారుకాదు. కానీ 2010నాటికి అంచె లంచెలుగా బిట్‌కాయిన్‌ విలువ పెరగింది. మార్చి చివరికిది 0.003అమెరికన్‌ డాల ర్లుగా నమోదైంది. అప్పట్నుంచి వాస్తవ కరెన్సీతో దీని ట్రేడింగ్‌ మొదలైంది. ఇక సాఫ్ట్‌వేర్‌ నిపుణులు దీనిపై ద ృష్టిపెట్టారు. సాఫ్ట్‌వేర్‌ ద్వారా ట్రేడింగ్‌ చేసే వ్యాపార సంస్థలు మదుపుకిదొక మార్గంగా ఎంచుకున్నారు. తమ ఖాతాదార్లను బిట్‌కాయిన్‌ల వైపు మళ్ళించడం మొదలెట్టారు. ఆదాయపన్ను, అమ్మకపుపన్ను ఇలా.. ప్రభుత్వ నిబంధనలు, ఒత్తిళ్ళు ఏమాత్రం లేని క్రిఎ్టో కరెన్సీ పట్ల మదుప రులు అనూహ్యంగా ఆకర్షితులుకావడంతో దీని విలువ అదే స్థాయిలో పెరిగింది. పైగా వివిధ దేశాల వాస్తవ కరెన్సీల విలువ హెచ్చుతగ్గులకు లోనౌతున్న సమయంలో కూడా బిట్‌ కాయిన్‌ విలువ పెరుగుతూనే ఉండడంతో దీనిపట్ల మరింత ఆసక్తి వెల్లడైంది. ఇలా గతేడాది చివరివరకు బిట్‌ కాయిన్‌ ధర పెరుగుతూ ఏకంగా 20వేల డాలర్లను దాటేసింది. దీనిపట్ల ఆసక్తిపెరగడానికి అనేక కారణుల ున్నాయి. ఇతర షేర్ల ట్రేడింగ్‌ల్లో మధ్య వర్తుల పాత్ర అధికం. కానీ బిట్‌కాయిన్‌ కొనాలన్నా, అమ్మాలన్నా మధ్యవర్తులుండ రు. ప్రత్యక్షంగా లావాదేవీలు జరుగుతాయి. ఒకప్పుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌ సైట్లకే పరి మితమైన బిట్‌కాయిన్‌ లావాదేవీలు అనంతరం పలు కొత్త సైట్లు కూడా ఆవిర్భవిం చాయి. కేవలం కొద్దిపాటి ప్రొసెసింగ్‌ ఫీజ్‌ మాత్రం చెల్లించి ఈ సైట్ల ద్వారా బిట్‌కాయి న్‌ల ఆర్దిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. పైగా వీటి కొనుగోలుకు ఫిజికల్‌ కరెన్సీ అవసరం లేదు. అందుకు బదులుగా వర్చువల్‌ కరెన్సీని వినియోగిస్తే చాలు. దీనివల్ల ఎలాంటి తలనొప్పులుండవు. కనిపించని ఆర్ధికనష్టాలకు అవకాశముండదు. బిట్‌కాయిన్‌లపై మదుపరులు పెరిగే కొద్ది ప్రపంచంలోని పలు దేశాలు కూడా వీటిపై దృష్టిపెట్టడం మొదలెట్టాయి. కొన్ని ప్రభుత్వాలైతే బిట్‌కాయిన్‌ను వాస్తవ కరెన్సీగా పరిగణించే అవకాశాల్ని అధ్యయనం చేశాయి. ఈ వార్తలు గుప్పుమనడంతో బిట్‌కా యిన్‌ విలువ మరింత వేగంగా పెరిగింది. అన్నింటికి మించి బిట్‌కాయిన్‌ల కొనుగోలుదార్లెవరు, అమ్ముతున్న వారెవరన్నది వారిద్దరికే తప్ప మరెవరికీ తెలిసే అవకాశంలేదు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీక్కూడా దీనివివరాలు అందుబాటులో ఉండవు. అన్నీ సందర్భాల్లోనూ అత్యంత గోప్యత అమలౌతుంది. దీంతో అనధికార ఆదాయాన్ని మదుపుచేసుకునేందుకు ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్త లు కూడా ఈ క్రిఎ్టో కరెన్సీ కొనుగోలుకు ప్రాధాన్యతనిచ్చారు. ఇవి పెరగడంతో కేవ లం బిట్‌కాయిన్‌ లావాదేవీల నిర్వహణ కోసం కొన్ని ఏక్సేంజ్‌లేర్పడ్డాయి. వీటి ద్వారా బిట్‌ కాయిన్‌ను వాస్తవ కరెన్సీలోకి మార్చుకోవచ్చు. ఇందుకోసం నిర్దేశిత రుసుం చెల్లిస్తే చాలు. బిట్‌ కాయిన్‌ల సమాచారం మొత్తం కంప్యూటర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ హ్యాకింగ్‌కు గుర య్యే ప్రమాదాన్ని శంకించిన సంస్థలు ఇందుకోసం ప్రత్యేకంగా యాంటీ హ్యాకర్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ది చేశారు. తాజాగా ఒక స్టెప్‌డౌన్‌గ్రేడ్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను మార్చేశారు. దీంతో గరిష్టస్థాయిలో సాఫ్ట్‌వేర్‌ రక్షణ చర్యలు చేపట్టారు. సాధారణ కరెన్సీకంటే అత్యంత వేగంగా వినియోగించుకుంటున్న బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ పట్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు మదుపరుల్ని హెచ్చరించాయి. ఇది సొంత రిస్క్‌తోనే చేసు కోవాలని, ఏ ప్రభుత్వం కూడా దీనికి పూచీకత్తుగా నిలవదని స్పష్టం చేశాయి. కేవలం మార్కెటింగ్‌ హెచ్చుతగ్గులకనుగుణంగానే బిట్‌కాయిన్‌ ధరలు పెరుగుతున్నాయి తప్ప ఇదెప్పటికీ ఫిజికల్‌ కరెన్సీకి పోటీకాదని కూడా స్పష్టం చేశాయి.
ప్రపంచ క్రిఎ్టో కరెన్సీలో భారతీయుల పెట్టుబడి అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 11శాతం వరకుంటుందని ఇటీవల రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులిస్తూ ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. దేశంలో బిట్‌కాయిన్‌ల క్రయవిక్రయాలకు ప్రత్యేకంగా డీలర్ల వ్యవస్థ కూడా ఏర్పాటైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఒక్క 2017లోనే భారత్‌ లో బిట్‌కాయిన్‌ల మార్కెట్‌ విలువ 2వేల రెట్లు పెరిగినట్లు ఆర్థికశాఖ తన అధ్యయ నంలో గుర్తించింది. దేశంలో నగదు రహిత ఆర్ధిక లావాదేవీల్ని పెంచడంతో అక్రమ మార్గాల్లో సమకూర్చుకున్న సొమ్మును అడ్డదారుల్లో పెట్టుబడులు పెట్టేందుకు బిట్‌కాయిన్ల మార్కెట్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు ప్రభుత్వం గుర్తించిం ది. ఈ కారణంగానే తాజా బడ్జెట్‌లో బిట్‌కాయిన్‌లకు భారత్‌లో చట్టబద్దత లేదంటూ అరుణ్‌జైట్లీ హెచ్చరించారు. దేశంలో బిట్‌కాయిన్‌లపై పెట్టుబడిదార్ల పట్ల కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు. పైగా ఊహాజనిత కరెన్సీ బిట్‌కాయిన్‌ లో పెట్టుబడిదార్లను గుర్తించి వాటివిలువపై ప న్నులు విధించనున్నట్లు కూడా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ ప్రకటించింది. ఇప్పటికే బిట్‌కాయిన్‌లలో పెట్టుబడుల ద్వారా లక్షలాదిమంది కోట్లాదిరూపాయల లాభాల్ని పొందిన విషయాన్ని ఈ సంస్థ గుర్తించింది. వీరందరికీ నోటీసులు జారీ చేయడం మొదలెట్టింది. ఈ కారణంగానే 2017-18ఆర్దిక సంవత్సరం నాలుగో త్రైమాసికం పన్ను వసూళ్ళు భారీగా ఉంటా యని అంచనాలేస్తోంది. ఈ నేపధ్యంలో ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తం గా వర్చువల్‌ కరెన్సీ వినియోగంపై ప్రభుత్వాలు కఠిన చర్యలు మొదలెట్టాయి. ఇంతవరకు స్విట్జర్లాండ్‌ తదితర కొన్ని పన్ను ఎగవేతదార్ల స్వర్గధామ దేశాల్లోని బ్యాంకుల్లో నిల్వ చేసుకున్న అక్రమ సంపాదనను బిట్‌కాయిన్‌లు, తదితర క్రిఎ్టో కరెన్సీ ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడిగా పెట్టిన పన్ను ఎగవేతదార్లకు తాజా పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగించడం తధ్యమని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులు క్రిఎ్టో కరెన్సీ పట్ల సాధారణ మదుపరుల్లో కూడా ఆసక్తిని తగ్గిస్తాయని విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment