Tuesday, 6 February 2018

1000వ విద్యార్థి.. వెయ్యి పౌండ్ల పురస్కారం! యూకే కళాశాలలో భారతీయ యువకుడి ఘనత

1000వ విద్యార్థి.. వెయ్యి పౌండ్ల పురస్కారం!
యూకే కళాశాలలో భారతీయ యువకుడి ఘనత

లండన్‌: యూకేలోని బర్మింగ్‌హామ్‌ సిటీ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ కళాశాల (బీసీయూఐసీ)లో 1000వ విద్యార్థిగా ఓ భారతీయ యువకుడు ఘనత సాధించాడు. దీంతో అతను 1000 పౌండ్ల (దాదాపు రూ. 90వేలు) పురస్కారం కూడా గెలుచుకున్నాడు. ఈమేరకు ముంబయికి చెందిన రచిత్‌ పటేల్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. బర్మింగ్‌హామ్‌కు కొద్ది మైళ్ల దూరంలో 2013లో ప్రారంభించిన బీసీయూఐసీలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూజీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్నారు. బర్మింగ్‌హామ్‌ సిటీ విశ్వవిద్యాలయం నుంచి మీడియా, కమ్యూనికేషన్‌లో బీఏ(హాన్స్‌) చేసిన రచిత్‌ ఈ కళాశాలలో ‘ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ ఫౌండేషన్‌’ కోర్సులో చేరాడు. యూకేలో చదవడమంటే ఎంతో ఇష్టపడే తాను ఇలాంటి చరిత్ర సృష్టిస్తానని ఊహించనేలేదని రచిత్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్థిక పురస్కారం తన చదువుకు చాలా ఉపకరిస్తుందన్నాడు. కాగా స్వల్పకాలంలోనే వెయ్యి మంది విద్యార్థుల మైలురాయికి చేరడం అబ్బురపరిచిందని ప్రిన్సిపాల్‌ చెర్లీ బాధమ్స్‌ హర్షం వ్యక్తం చేశారు. జింబాబ్వేకు చెందిన కథీజోయే బెయిరా ఈ కళాశాల తొలి విద్యార్థి.

No comments:

Post a Comment