Wednesday, 7 February 2018

విజయవంతంగా హక్‌ గగన విహారం

బెంగళూరు: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థ(హెచ్‌ఏఎల్‌) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన రియల్‌ టైమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఆర్టీవోస్‌)ను బిగించిన హక్‌ విమానం విజయవంతంగా వినువీధిలో విహరించింది. ‘ఆర్టీవోస్‌ను పూర్తిగా ఇక్కడే తయారు చేశాం. ఇందుకు ఖరగ్‌పూర్‌ ఐఐటీ సహకారాన్ని తీసుకున్నాం. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించాం. సెంటర్‌ ఫర్‌ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్‌ ఆండ్‌ సర్టిఫికేషన్‌(సెమిలాక్‌) సంస్థ నుంచి ప్రమాణపత్రం కూడా అందింది. ప్రస్తుతం మన దేశంలో విమానాలకు, ఏవియానిక్స్‌ వ్యవస్థలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆర్టీవోస్‌ను అమర్చుతున్నారు. వివిధ వ్యవస్థలు సమర్థంగా, నమ్మకంగా పనిచేసేందుకు ఇవి దోహదపడతాయి’అని హెచ్‌ఏఎల్‌ ఛైర్మన్‌ సువర్ణరాజు తెలిపారు.

No comments:

Post a Comment