24గంటల విద్యుత్తు వద్దని ధర్నా
  ;రైతులకు అందిస్తున్న 24గంటల కరెంటు వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతు సంఘాల నాయకులు జనగామ.. సూర్యాపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ 24గంటల కరెంటు కారణంగా బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయని, మరికొన్ని రోజులు ఇదేవిధంగా జరిగితే తాగునీటి సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ధర్నా కారణంగా రహదారిపై దాదాపు 2గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో టీమాస్ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

No comments:
Post a Comment