Friday, 9 February 2018

వాట్సాప్‌ పేమెంట్స్‌ వచ్చేసింది

వాట్సాప్‌ పేమెంట్స్‌ వచ్చేసింది!

స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న నేటి యువతకు వాట్సాప్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ ఏదైనా నగదు చెల్లింపులు చేయాలంటే ఆయా బ్యాంకుల యాప్‌లు లేదా, పేటీఎం వంటి పేమెంట్స్‌ యాప్‌లను వినియోగించాల్సి వచ్చేది. ఇక నుంచి మీకు వాట్సాప్‌ ఉంటే చాలు మీరు చెల్లింపులు చేసేయొచ్చు. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో వాట్సాప్‌ బీటా వెర్షన్‌ వినియోగిస్తున్న వారు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా వాట్సాప్‌లో నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఐవోఎస్‌లో 2.18.21 వాట్సాప్‌ వెర్షన్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లు 2.18.41 వెర్షన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. డిజిటల్‌ చెల్లింపులకు ఇది మరింత ఊతం ఇస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వాట్సాప్‌లోని చాట్‌ విండో ఓపెన్‌ చేస్తే గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్స్‌ జాబితాతో పాటు ఇప్పుడు పేమెంట్స్‌ ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి. అక్కడ కనిపించే బ్యాంకుల జాబితాలో యూపీఐ కనెక్షన్‌ ఉన్న మీ బ్యాంకు ఖాతాను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ మీరు యూపీఐ పేమెంట్స్‌ను వినియోగించకపోతే ధ్రువీకరణ కోసం పిన్‌ అడుగుతుంది. యూపీఐ యాప్‌ లేదా బ్యాంకు వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా యూపీఐ ఖాతాను యాక్టివేట్‌ చేసుకోవాలి. ఇద్దరికీ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ ఉండి, పేమెంట్స్‌ ఆప్షన్‌ లాగిన్‌ అయిన వారికి మాత్రమే నగదు లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంది.

No comments:

Post a Comment