స్నానాల గది నిర్మాణంలో జాగ్రత్తలు తప్పనిసరి
స్నానాల గదిలో జారిపడి చిన్నాపెద్దా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. గచ్చుకు ఉపయోగిస్తున్న పలకలు చాలావరకు కారణం అవుతున్నాయి. జారుడును నిరోధించే పలకలు ఇప్పుడు పలు రకాలున్నాయి. సరైనవాటి ఎంపికతో సురక్షితంగా ఉండొచ్చు.
ఇంటి నిర్మాణంలో స్నానాల గది అంటే చాలామందికి చిన్నచూపు. ఇరుకిరుకుగా ఏదో కట్టేశాం అన్నట్లుగానే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వరండా, పడక గది గచ్చు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించే వారు సైతం స్నానాల గది వచ్చేసరికి రాజీపడిపోతుంటారు. ఇక్కడ గడిపేది రోజులో కొద్ది సమయమే కదా అనేది వారి భావన. ముఖ్యంగా గచ్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జారే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.
ఎన్నో రకాలు
స్నానాల గదుల్లో గచ్చుకు ఉపయోగించే పలకల్లో(టైల్స్) జారిపడకుండా పలు రకాలు మార్కెట్లో ఉన్నాయి. సిరామిక్, విట్రిఫైడ్‌లోనే ఎన్నో డిజైన్లు వచ్చాయి.
* స్లిప్ షీల్డ్ ఫ్లోర్ టైల్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇవి జారుడును నిరోధిస్తాయి. పలకల ఉపరితలం తడి, సబ్బు నురుగ ఉన్నప్పుడు కూడా ఘర్షణను అధికంగా చేసేందుకు ఈ పలకలకు పూత పూస్తారు. దీనివల్ల తడి ఉన్నప్పుడు కూడా కాలు పట్టు తప్పకుండా ఉంటుంది.
* స్నానాల గదుల్లోనే కాదు బయట నీరు నిలిచే ప్రాంతాల్లోనూ ఈ పలకలను ఉపయోగించుకోవచ్చు.
* గోధుమ, బూడిద, క్రీమ్, తెలుపు రంగుల్లో ఈ పలకలు అందుబాటులో ఉన్నాయి.
విట్రిఫైడ్‌లో..
స్నానాల గదిలో గచ్చు దృఢంగా ఉండాలనుకునే వారు ఈ పలకలను వేయించుకోవచ్చు. అధిక బరువును ఇవి తట్టుకోగలవు. వీటిపైన నీరు అస్సలు నిలవకుండా ఉండేలా గచ్చు గరుకుగా ఉంటుంది. రాతి పలక మాదిరి ఫినిషింగ్‌తో చూసేందుకు ఆకర్షణగా ఉంటుంది. సిరామిక్‌తో పోలిస్తే ధర కాస్త ఎక్కువే పెట్టాలి.
* పలకలపై తేమను నిరోధిస్తుంది. ఫలితంగా బ్యాక్టీరియా చేరదు.
* వీటిని శుభ్రం చేయడం సులువు. నిర్వహణ చాలా తేలిక.
* మ్యాట్, రస్టిక్ ఫినిష్‌లలో లభిస్తున్నాయి. బూడిద రంగు, ముదురు బూడిద, నలుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
వెలుతురు వచ్చేలా..
స్నానాల గదిలో కేవలం జారిపడకుండా ఉండే పలకలు పరిస్తే సరిపోదు. తగిన గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. సహజ వెలుతురు ఉండాలి. ఫలితంగా గచ్చుపై, పలకలపై తడి లేకుండా ఎప్పటికప్పుడు ఆరిపోతాయి. తేమ లేకుండా పొడిగా ఉంటాయి. బ్యాక్టీరియా చేరదు.
* సరైన వెలుతురు లేక విద్యుత్తు వెలుగే అనివార్యంగా ఉన్న గదుల్లో తడి ఉన్న విషయమూ స్పష్టంగా కనిపించదు. దీంతో జారి పడే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విశాలంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆర్కిటెక్చర్లు.
* కారే నల్లాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడాన్ని అలక్ష్యం చేయొద్దు.

నిర్వహణ తేలిక
బడ్జెట్లో సిరామిక్‌లో ఎక్కువ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కొత్త రకాలు వచ్చాయి. ఫోర్స్‌లీన్, సాటిక్ మ్యాట్, మెటాలిక్ ఫినిష్‌లలో దొరుకుతున్నాయి. వీటి నిర్వహణ కూడా తేలిక.
* నీరు పలకలపై పడగానే నిల్వ ఉండకుండా పల్లానికి చేరుతుంది. చిన్నచిన్న నీటి బిందువులుగా విడిపోతుంది. దీంతో గచ్చుపై తడి లేకుండా కాలు పట్టు నిల్చేలా చూస్తుంది.

No comments:
Post a Comment