ఎడిస్ అబాబాః చైనా దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. సాయం చేస్తామంటూ మొదట చేయందించడం.. ఆ తర్వాత వాళ్లకే ఎసరు పెట్టడం మొదటి నుంచీ చైనాకు ఉన్న అలవాటు. ప్రపంచ శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా.. చిన్నచిన్న దేశాలకు ఇలాంటి ఎరలే వేసి బుట్టలోకి వేసుకుంటుంది. అయితే ఆ తర్వాత ఆ దేశాలకు డ్రాగన్ నిజ స్వరూపం తెలిసి దానిని దూరం పెడతాయి. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆఫ్రికా ఫ్రెండ్స్‌కు చైనా గిఫ్ట్ అంటూ ఇథియోపియా రాజధాని ఎడిస్ అబాబాలో ఆఫ్రికన్ యూనియన్ హెడ్‌క్వార్టర్స్‌ను నిర్మించి ఇచ్చింది చైనా. ఈ ఆఫీస్‌లో కంప్యూటర్ వ్యవస్థలను, నెట్‌వర్క్‌లను కూడా చైనానే ఏర్పాటు చేసి ఆఫ్రికన్ యూనియన్‌కు 2012లో ఇచ్చింది. చైనా ఉదారత వెనుక ఉన్న దురుద్దేశం ఇప్పుడు బయటపడింది. ఐదేళ్లుగా ప్రతి రోజు రాత్రి ఆఫ్రికన్ యూనియన్‌కు సంబంధించిన మొత్తం డేటాను షాంఘైలోని సర్వర్‌కు గుట్టుచప్పుడు కాకుండా చైనా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆఫ్రికన్ యూనియన్ ఇప్పుడు పాత సర్వర్లను మొత్తం తొలగించి.. కొత్తవాటిని ఏర్పాటు చేసుకుంటున్నది. దీనికోసం చైనా సాయం చేస్తామన్నా కూడా మీకో దండం అంటూ దానిని నిరాకరించింది.
చైనా దొంగచాటుగా డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నట్లు ఈ మధ్యే ఫ్రెంచ్ పత్రిక లె మాండె బయటపెట్టింది. డేటా చోరీతోపాటు గూఢచర్యం కూడా చేస్తున్నట్లు ఈ పత్రిక ఆరోపించింది. దీంతో అలర్టయిన ఆఫ్రికన్ యూనియన్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది.. డేటా ట్రాన్స్‌ఫర్స్‌పై నిఘా వేశారు. ప్రతి రోజు అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్ అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ సమయంలో ఆఫీస్‌లో ఎవరూ లేకపోవడం గమనార్హం. 2012 నుంచి ఇలాగే జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో పాత సర్వర్లను తొలగించి కొత్త సర్వర్లు తీసుకొచ్చారు. ఆఫీస్ మొత్తం గాలిస్తే.. డెస్కుల్లో మైక్రోఫోన్లు కూడా కనిపించాయి. దీంతో చైనా దొంగ బుద్ధి బయటపడింది. ఇన్నాళ్లూ డ్రాగన్ గూఢచర్యం చేసినట్లు స్పష్టమైంది. చైనాను వ్యతిరేకిస్తున్న ఆఫ్రికా దేశాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న సమయంలో ఈ గూఢచర్యం కూడా బయటపడటం గమనార్హం. ఇప్పటికే బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్, చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ల పేరుతో పాకిస్థాన్, శ్రీలంకలను గుప్పిట్లోకి తెచ్చుకున్న చైనా.. ఆఫ్రికా విషయంలోనూ అలాగే చేయాలని చూసినా అది బెడిసికొట్టింది.
అయితే ఎప్పటిలాగే చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఆఫ్రికన్ యూనియన్‌కు చైనా అంబాసిడర్‌గా ఉన్న కువాంగ్ వీలిన్ మాట్లాడుతూ.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. ఈ వార్త పూర్తిగా నిరాధారం. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది. అంతేకాదు చైనా, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది అని కువాంగ్ అన్నారు. ఆఫ్రికా అభివృద్ధి పేరిట ఆ దేశాల్లో ఉన్న విలువైన ఖనిజాలను తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నది చైనా. ఈ విషయాన్ని ఆఫ్రికా దేశాలు గమనించి.. క్రమంగా డ్రాగన్‌ను దూరం పెడుతూ వస్తున్నాయి.

No comments:
Post a Comment