జీఎస్‌టీ అమలు.. సొంతింటి గుబులు
పన్ను తగ్గిస్తేనే ఇంటి కలకు రూపం
బడ్జెట్‌పై కొనుగోలుదారుల ఆశలు
పన్ను తగ్గిస్తేనే ఇంటి కలకు రూపం
బడ్జెట్‌పై కొనుగోలుదారుల ఆశలు
సొంతింటి కల నెరవేర్చుకోవడంలో సామాన్య, మధ్యతరగతి వారికి బడ్జెట్ ఊతంగా నిలువనుందా.. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఇప్పుడు అందరి అంచనాలు. కొనుగోలుదారులే కాదు నిర్మాణదారులు బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది కాలంగా నిర్మాణ రంగానికి ప్రకటించిన ప్రోత్సాహకాలకు కొనసాగింపుగా మరికొన్నింటిని స్థిరాస్తి పరిశ్రమ ఆశిస్తోంది. ఇది తమకే కాదు కొనుగోలుదారులకూ మేలు చేస్తుందంటున్నారు. జీఎస్‌టీ అమలు ఇంటి కొనుగోలును మరింత భారం చేసింది. ఈ భారాన్ని దించాలని ఇటు కొనుగోలుదారులు.. అటు స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రభావం పూర్తిగా తొలగడంతో స్థిరాస్తి మార్కెట్ సాధారణ స్థాయికి చేరిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. నగదు లభ్యతతో మార్కెట్లో జోరుగా లావాదేవీలు జరుగుతున్నాయి. స్థలాలు, భూములు, ఫ్లాట్ల విక్రయాలు పుంజుకున్నాయి. దీనికి బడ్జెట్ ప్రోత్సాహకాలు తోడైతే మార్కెట్ మరింత ఆశాజనకంగా ఉంటుందని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు అంటున్నారు. జీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నాలుగు పన్నులు వేస్తున్నాయి. ఒకటే పన్ను ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పన్ను శాతం కూడా చాలా తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు.

రుణ లభ్యత పెరిగేలా..
స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) రావడంతో ఇప్పటిలాగా ముందస్తు బుకింగ్‌కు అవకాశం ఉండదని నిర్మాణదారులు అంటున్నారు. అనుమతులన్నీ వచ్చాకనే విక్రయించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఒకసారి ప్రాజెక్ట్ ప్రారంభించాక విక్రయాలు ఉన్నా లేకున్నా నిర్దేశించిన గడువులోపు పూర్తిచేయాలి. ఇది జరగాలంటే బ్యాంకులు నిర్మాణ రంగానికి తగినంత నిధులు మంజూరు చేయాలి. స్థిరాస్తి రంగం ఎప్పటి నుంచో కోరుతున్నట్లుగా మౌలిక పరిశ్రమ హోదా వస్తే సహజంగా బ్యాంకుల నుంచి రుణ వితరణ పెరుగుతుంది. అందుబాటు ఇళ్ల వరకు గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించినా.. అన్నింటికీ ఈ హోదా వర్తింపచేయాలని సంఘాల ప్రతినిధులు అంటున్నారు.

వడ్డీరేట్లలో కోత వేస్తే..
పెద్ద నోట్ల ఉపసంహరణ అనంతరం బ్యాంకుల వద్ద నగదు జమ పెరిగితే గృహరుణ వడ్డీరేట్లు తగ్గుతాయని అందరూ ఆశించారు. 8.25 శాతం వరకే తగ్గాయి. అయినా కూడా సామాన్య, మధ్యతరగతి వారికి భారమే. బ్యాంకులు రుణాలు ఇస్తామంటున్నా నెలసరి కిస్తులు కట్టడం భారమై సొంతింటికి ఇప్పటికీ చాలామంది దూరమవుతున్నారు. వడ్డీరేట్లు తగ్గితే రుణ మొత్తం పెరుగుతుంది. సొంతింటి కలను నెరవేర్చుకోగలుగుతామని సామాన్యులు కోరుకుంటున్నారు.
* మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఆదాయ పన్ను సెక్షన్ 80ఈఈ కింద రూ.50వేల అదనపు ప్రయోజనాన్ని గతంలో కేంద్రం కల్పించింది. దీన్ని కొనసాగించడంతో పాటూ రూ.50 లక్షల లోపు విలువ చేసే ఇళ్లకే పరిమితమనే ఆంక్షల్ని తొలగించాలని కోరుకుంటున్నారు.

No comments:
Post a Comment