Wednesday, 31 January 2018

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీ, శ్రీన‌గ‌ర్‌లో ప్ర‌కంప‌న‌లు..

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఇవాళ భూకంపం సంభ‌వించింది. కుంజ్ స‌మీపంలో రిక్ట‌ర్ స్కేల్‌పై 6.1 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది. ఆ భూకంప ప్ర‌భావం పాకిస్థాన్‌, భార‌త్‌లోనూ క‌నిపించింది. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, శ్రీన‌గ‌ర్ ప్రాంతాల్లో భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో భూప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భూప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాబుల్‌కు 270 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హిందూఖుష్ ప‌ర్వ‌త శ్రేణుల్లో భూకంపం సంభ‌వించింది. ఢిల్లీలోని కొన్ని టీవీ స్టూడియోల్లో లైట్లు అటూ ఇటూ క‌దిలిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీన‌గ‌ర్‌లో ఆఫీసులు, బిల్డింగ్‌ల నుంచి జ‌నం ప‌రుగులు తీశారు. అమృత్‌స‌ర్‌లోనూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. బ‌లోచిస్థాన్ ప్రాంతంలోని లాస్‌బెల్లాలో భూకంపం వ‌ల్ల‌ ఒక‌రు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

No comments:

Post a Comment