Wednesday, 31 January 2018

జారకుండా చూసుకోండి!

స్నానాల గది నిర్మాణంలో జాగ్రత్తలు తప్పనిసరి



స్నానాల గదిలో జారిపడి చిన్నాపెద్దా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. గచ్చుకు ఉపయోగిస్తున్న పలకలు చాలావరకు కారణం అవుతున్నాయి. జారుడును నిరోధించే పలకలు ఇప్పుడు పలు రకాలున్నాయి. సరైనవాటి ఎంపికతో సురక్షితంగా ఉండొచ్చు.
ఇం
టి నిర్మాణంలో స్నానాల గది అంటే చాలామందికి చిన్నచూపు. ఇరుకిరుకుగా ఏదో కట్టేశాం అన్నట్లుగానే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వరండా, పడక గది గచ్చు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించే వారు సైతం స్నానాల గది వచ్చేసరికి రాజీపడిపోతుంటారు. ఇక్కడ గడిపేది రోజులో కొద్ది సమయమే కదా అనేది వారి భావన. ముఖ్యంగా గచ్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జారే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. 
ఎన్నో రకాలు
స్నానాల గదుల్లో గచ్చుకు ఉపయోగించే పలకల్లో(టైల్స్‌) జారిపడకుండా పలు రకాలు మార్కెట్లో ఉన్నాయి. సిరామిక్‌, విట్రిఫైడ్‌లోనే ఎన్నో డిజైన్లు వచ్చాయి.
స్లిప్‌ షీల్డ్‌ ఫ్లోర్‌ టైల్స్‌ మార్కెట్లో ఉన్నాయి. ఇవి జారుడును నిరోధిస్తాయి. పలకల ఉపరితలం తడి, సబ్బు నురుగ ఉన్నప్పుడు కూడా ఘర్షణను అధికంగా చేసేందుకు ఈ పలకలకు పూత పూస్తారు. దీనివల్ల తడి ఉన్నప్పుడు కూడా కాలు పట్టు తప్పకుండా ఉంటుంది.
స్నానాల గదుల్లోనే కాదు బయట నీరు నిలిచే ప్రాంతాల్లోనూ ఈ పలకలను ఉపయోగించుకోవచ్చు.
గోధుమ, బూడిద, క్రీమ్‌, తెలుపు రంగుల్లో ఈ పలకలు అందుబాటులో ఉన్నాయి.
విట్రిఫైడ్‌లో..
స్నానాల గదిలో గచ్చు దృఢంగా ఉండాలనుకునే వారు ఈ పలకలను వేయించుకోవచ్చు. అధిక బరువును ఇవి తట్టుకోగలవు. వీటిపైన నీరు అస్సలు నిలవకుండా ఉండేలా గచ్చు గరుకుగా ఉంటుంది. రాతి పలక మాదిరి ఫినిషింగ్‌తో చూసేందుకు ఆకర్షణగా ఉంటుంది. సిరామిక్‌తో పోలిస్తే ధర కాస్త ఎక్కువే పెట్టాలి.
పలకలపై తేమను నిరోధిస్తుంది. ఫలితంగా బ్యాక్టీరియా చేరదు.
వీటిని శుభ్రం చేయడం సులువు. నిర్వహణ చాలా తేలిక.
మ్యాట్‌, రస్టిక్‌ ఫినిష్‌లలో లభిస్తున్నాయి. బూడిద రంగు, ముదురు బూడిద, నలుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
వెలుతురు వచ్చేలా..
స్నానాల గదిలో కేవలం జారిపడకుండా ఉండే పలకలు పరిస్తే సరిపోదు. తగిన గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. సహజ వెలుతురు ఉండాలి. ఫలితంగా గచ్చుపై, పలకలపై తడి లేకుండా ఎప్పటికప్పుడు ఆరిపోతాయి. తేమ లేకుండా పొడిగా ఉంటాయి. బ్యాక్టీరియా చేరదు.
సరైన వెలుతురు లేక విద్యుత్తు వెలుగే అనివార్యంగా ఉన్న గదుల్లో తడి ఉన్న విషయమూ స్పష్టంగా కనిపించదు. దీంతో జారి పడే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విశాలంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆర్కిటెక్చర్లు.
కారే నల్లాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడాన్ని అలక్ష్యం చేయొద్దు.

నిర్వహణ తేలిక 


డ్జెట్‌లో సిరామిక్‌లో ఎక్కువ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కొత్త రకాలు వచ్చాయి. ఫోర్స్‌లీన్‌, సాటిక్‌ మ్యాట్‌, మెటాలిక్‌ ఫినిష్‌లలో దొరుకుతున్నాయి. వీటి నిర్వహణ కూడా తేలిక.
నీరు పలకలపై పడగానే నిల్వ ఉండకుండా పల్లానికి చేరుతుంది. చిన్నచిన్న నీటి బిందువులుగా విడిపోతుంది. దీంతో గచ్చుపై తడి లేకుండా కాలు పట్టు నిల్చేలా చూస్తుంది.

పన్ను తగ్గిస్తేనే ఇంటి కలకు రూపం

జీఎస్‌టీ అమలు.. సొంతింటి గుబులు 
పన్ను తగ్గిస్తేనే ఇంటి కలకు రూపం 
బడ్జెట్‌పై కొనుగోలుదారుల ఆశలు


 సొంతింటి కల నెరవేర్చుకోవడంలో సామాన్య, మధ్యతరగతి వారికి బడ్జెట్‌ ఊతంగా నిలువనుందా.. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఇప్పుడు అందరి అంచనాలు. కొనుగోలుదారులే కాదు నిర్మాణదారులు బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది కాలంగా నిర్మాణ రంగానికి ప్రకటించిన ప్రోత్సాహకాలకు కొనసాగింపుగా మరికొన్నింటిని స్థిరాస్తి పరిశ్రమ ఆశిస్తోంది. ఇది తమకే కాదు కొనుగోలుదారులకూ మేలు చేస్తుందంటున్నారు. జీఎస్‌టీ అమలు ఇంటి కొనుగోలును మరింత భారం చేసింది. ఈ భారాన్ని దించాలని ఇటు కొనుగోలుదారులు.. అటు స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రభావం పూర్తిగా తొలగడంతో స్థిరాస్తి మార్కెట్‌ సాధారణ స్థాయికి చేరిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. నగదు లభ్యతతో మార్కెట్లో జోరుగా లావాదేవీలు జరుగుతున్నాయి. స్థలాలు, భూములు, ఫ్లాట్ల విక్రయాలు పుంజుకున్నాయి. దీనికి బడ్జెట్‌ ప్రోత్సాహకాలు తోడైతే మార్కెట్‌ మరింత ఆశాజనకంగా ఉంటుందని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు అంటున్నారు. జీఎస్‌టీ, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నాలుగు పన్నులు వేస్తున్నాయి. ఒకటే పన్ను ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పన్ను శాతం కూడా చాలా తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు.
రుణ లభ్యత పెరిగేలా..
స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) రావడంతో ఇప్పటిలాగా ముందస్తు బుకింగ్‌కు అవకాశం ఉండదని నిర్మాణదారులు అంటున్నారు. అనుమతులన్నీ వచ్చాకనే విక్రయించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఒకసారి ప్రాజెక్ట్‌ ప్రారంభించాక విక్రయాలు ఉన్నా లేకున్నా నిర్దేశించిన గడువులోపు పూర్తిచేయాలి. ఇది జరగాలంటే బ్యాంకులు నిర్మాణ రంగానికి తగినంత నిధులు మంజూరు చేయాలి. స్థిరాస్తి రంగం ఎప్పటి నుంచో కోరుతున్నట్లుగా మౌలిక పరిశ్రమ హోదా వస్తే సహజంగా బ్యాంకుల నుంచి రుణ వితరణ పెరుగుతుంది. అందుబాటు ఇళ్ల వరకు గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించినా.. అన్నింటికీ ఈ హోదా వర్తింపచేయాలని సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
వడ్డీరేట్లలో కోత వేస్తే..
పెద్ద నోట్ల ఉపసంహరణ అనంతరం బ్యాంకుల వద్ద నగదు జమ పెరిగితే గృహరుణ వడ్డీరేట్లు తగ్గుతాయని అందరూ ఆశించారు. 8.25 శాతం వరకే తగ్గాయి. అయినా కూడా సామాన్య, మధ్యతరగతి వారికి భారమే. బ్యాంకులు రుణాలు ఇస్తామంటున్నా నెలసరి కిస్తులు కట్టడం భారమై సొంతింటికి ఇప్పటికీ చాలామంది దూరమవుతున్నారు. వడ్డీరేట్లు తగ్గితే రుణ మొత్తం పెరుగుతుంది. సొంతింటి కలను నెరవేర్చుకోగలుగుతామని సామాన్యులు కోరుకుంటున్నారు.
* మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఆదాయ పన్ను సెక్షన్‌ 80ఈఈ కింద రూ.50వేల అదనపు ప్రయోజనాన్ని గతంలో కేంద్రం కల్పించింది. దీన్ని కొనసాగించడంతో పాటూ రూ.50 లక్షల లోపు విలువ చేసే ఇళ్లకే పరిమితమనే ఆంక్షల్ని తొలగించాలని కోరుకుంటున్నారు.

click here earn money


ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీ, శ్రీన‌గ‌ర్‌లో ప్ర‌కంప‌న‌లు..

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఇవాళ భూకంపం సంభ‌వించింది. కుంజ్ స‌మీపంలో రిక్ట‌ర్ స్కేల్‌పై 6.1 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది. ఆ భూకంప ప్ర‌భావం పాకిస్థాన్‌, భార‌త్‌లోనూ క‌నిపించింది. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, శ్రీన‌గ‌ర్ ప్రాంతాల్లో భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో భూప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భూప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాబుల్‌కు 270 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హిందూఖుష్ ప‌ర్వ‌త శ్రేణుల్లో భూకంపం సంభ‌వించింది. ఢిల్లీలోని కొన్ని టీవీ స్టూడియోల్లో లైట్లు అటూ ఇటూ క‌దిలిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీన‌గ‌ర్‌లో ఆఫీసులు, బిల్డింగ్‌ల నుంచి జ‌నం ప‌రుగులు తీశారు. అమృత్‌స‌ర్‌లోనూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. బ‌లోచిస్థాన్ ప్రాంతంలోని లాస్‌బెల్లాలో భూకంపం వ‌ల్ల‌ ఒక‌రు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

చెల్లి ఫోను చూసి.. షాకయ్యా!

ఇది నా చెల్లి సమస్య.  బీటెక్‌ రెండో ఏడాది హాస్టల్‌లో ఉండి చదువుతోంది. ఈ మధ్య ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా తన ఫోను తీసుకున్నా. అన్నీ అభ్యంతరకరమైన సందేశాలూ, చిత్రాలే కనిపించాయి. అబ్బాయిలు మాత్రమే వాటిని చూస్తారని అనుకునే నేను తన ఫోన్‌చూసి ఒక్కసారి షాకయ్యా. తనెందుకు వాటికి అలవాటు పడిందో అర్థం కాలేదు. పైగా అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పలేను. ఎందుకంటే వారు తను ఎంతో ఉన్నతంగా చదువుతోందని ఉద్యోగం చేసి తమ పేరు నిలబెడుతుందని ఆశలు పెంచుకున్నారు. అడిగితే నాతో గొడవ పెట్టుకుంది. తన మీద అభాండాలు వేస్తున్నాని చెబుతూ ఆ ఫోన్‌లోవన్నీ తీసేసింది.  వెంటనే కాలేజీలో వచ్చేయమన్నారంటూ వెళ్లిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి.
- ఓ సోదరి



మ్మానాన్నలకు మీరు చెప్పలేకపోవడాన్ని అర్థం చేసుకోగలను. మీ చెల్లి తన విషయం బయటపడిందనీ, గొడవ పడి హాస్టల్‌కి వెళ్లిపోయిందని మీ ఉత్తరం ద్వారా అర్థమవుతుంది. అయితే కొన్ని రోజులాగి సందర్భాన్ని కల్పించుకునైనా, తనతో అనునయంగా మాట్లాడండి. టీనేజీలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే మార్పులూ, లైంగిక విషయాలపై కలిగే తీవ్రమైన ఆసక్తి, దారి తీసే పరిస్థితులను గురించి అర్థమయ్యేలా చెప్పండి. మీరు చెప్పలేకపోయినా వారికి దగ్గరగా ఉండే ఎవరితోనైనా చెప్పించే ప్రయత్నం చేయండి. అలాగే ఆమెకు హాస్టల్‌లో స్నేహితులు ఉన్నారా? వారితో ఏ   విధంగా వ్యవహరిస్తోందన్న విషయాలూ తెలుసుకోవడం తప్పనిసరి. కొన్నిసార్లు వారిలోని అభద్రతా, ఆత్మనూన్యతా, ఒంటరితనం వంటివన్నీ ఈ పరిస్థితికి కారణం అవుతాయి. వీటికి వయసుతో పాటు వచ్చే హార్మోన్ల హెచ్చుతగ్గులూ, స్నేహితుల ప్రభావం తోడవుతాయి. అందువల్లే మేం కూడా చేస్తే తప్పేంటని అనుకుంటారు. స్నేహితులే కారణమే అయితే, మంచి ఆలోచనలు, లక్ష్యాలున్న వారితో సాన్నిహిత్యం పెంపొందించుకునేలా చూడండి. అవసరమైతే ఈ సమయంలో అధ్యాపకుల సాయమూ తీసుకోండి. అలాగే ఒంటరితనమే ఈ పరిస్థితికి కారణమైతే, సామాజిక చొరవను పెంపొందించుకునేలా సాయం చేయండి. మంచి స్నేహితురాళ్లని ఏర్పరుచుకోవడం వల్ల ఇంతకంటే ఎక్కువ సరదాలూ, సంతోషాలు ఉంటాయని నచ్చచెప్పేందుకు ప్రయత్నించండి. అదే సమయంలో  తల్లిదండ్రులకూ సున్నితంగా మీరీ  విషయాన్ని తెలియజేయండి. అయినా ఆమెలో మార్పు రాకపోతే గనుక మానసిక నిపుణుల సాయం తీసుకోండి.

Tuesday, 30 January 2018

Woman stoned to death in Hyderabad in India

A woman named Anusha was beaten to death by an unknown person in Hyderabad.

The miscreant allegedly thrashed the victim with a stone in her house at Hayat Nagar.

The house owners noticed her lying dead in the room and alerted the police.
According to the sources, Anusha hailed from Devarakonda and was pursuing training for police constable post after completing B. Tech. 

A case has been registered and the police are investigating. The police suspect that the murder was committed by some person known to the victim.

Evidence has been collected from her house and Anusha’s parents have been informed regarding her death.

Further details are awaited.

చైనా దొంగ బుద్ధి.. ఆఫ్రికా డేటా చోరీ!

ఎడిస్ అబాబాః చైనా దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. సాయం చేస్తామంటూ మొదట చేయందించడం.. ఆ తర్వాత వాళ్లకే ఎసరు పెట్టడం మొదటి నుంచీ చైనాకు ఉన్న అలవాటు. ప్రపంచ శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా.. చిన్నచిన్న దేశాలకు ఇలాంటి ఎరలే వేసి బుట్టలోకి వేసుకుంటుంది. అయితే ఆ తర్వాత ఆ దేశాలకు డ్రాగన్ నిజ స్వరూపం తెలిసి దానిని దూరం పెడతాయి. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆఫ్రికా ఫ్రెండ్స్‌కు చైనా గిఫ్ట్ అంటూ ఇథియోపియా రాజధాని ఎడిస్ అబాబాలో ఆఫ్రికన్ యూనియన్ హెడ్‌క్వార్టర్స్‌ను నిర్మించి ఇచ్చింది చైనా. ఈ ఆఫీస్‌లో కంప్యూటర్ వ్యవస్థలను, నెట్‌వర్క్‌లను కూడా చైనానే ఏర్పాటు చేసి ఆఫ్రికన్ యూనియన్‌కు 2012లో ఇచ్చింది. చైనా ఉదారత వెనుక ఉన్న దురుద్దేశం ఇప్పుడు బయటపడింది. ఐదేళ్లుగా ప్రతి రోజు రాత్రి ఆఫ్రికన్ యూనియన్‌కు సంబంధించిన మొత్తం డేటాను షాంఘైలోని సర్వర్‌కు గుట్టుచప్పుడు కాకుండా చైనా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆఫ్రికన్ యూనియన్ ఇప్పుడు పాత సర్వర్లను మొత్తం తొలగించి.. కొత్తవాటిని ఏర్పాటు చేసుకుంటున్నది. దీనికోసం చైనా సాయం చేస్తామన్నా కూడా మీకో దండం అంటూ దానిని నిరాకరించింది. 

చైనా దొంగచాటుగా డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నట్లు ఈ మధ్యే ఫ్రెంచ్ పత్రిక లె మాండె బయటపెట్టింది. డేటా చోరీతోపాటు గూఢచర్యం కూడా చేస్తున్నట్లు ఈ పత్రిక ఆరోపించింది. దీంతో అలర్టయిన ఆఫ్రికన్ యూనియన్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది.. డేటా ట్రాన్స్‌ఫర్స్‌పై నిఘా వేశారు. ప్రతి రోజు అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్ అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ సమయంలో ఆఫీస్‌లో ఎవరూ లేకపోవడం గమనార్హం. 2012 నుంచి ఇలాగే జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో పాత సర్వర్లను తొలగించి కొత్త సర్వర్లు తీసుకొచ్చారు. ఆఫీస్ మొత్తం గాలిస్తే.. డెస్కుల్లో మైక్రోఫోన్లు కూడా కనిపించాయి. దీంతో చైనా దొంగ బుద్ధి బయటపడింది. ఇన్నాళ్లూ డ్రాగన్ గూఢచర్యం చేసినట్లు స్పష్టమైంది. చైనాను వ్యతిరేకిస్తున్న ఆఫ్రికా దేశాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న సమయంలో ఈ గూఢచర్యం కూడా బయటపడటం గమనార్హం. ఇప్పటికే బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్, చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ల పేరుతో పాకిస్థాన్, శ్రీలంకలను గుప్పిట్లోకి తెచ్చుకున్న చైనా.. ఆఫ్రికా విషయంలోనూ అలాగే చేయాలని చూసినా అది బెడిసికొట్టింది. 

అయితే ఎప్పటిలాగే చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఆఫ్రికన్ యూనియన్‌కు చైనా అంబాసిడర్‌గా ఉన్న కువాంగ్ వీలిన్ మాట్లాడుతూ.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. ఈ వార్త పూర్తిగా నిరాధారం. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది. అంతేకాదు చైనా, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది అని కువాంగ్ అన్నారు. ఆఫ్రికా అభివృద్ధి పేరిట ఆ దేశాల్లో ఉన్న విలువైన ఖనిజాలను తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నది చైనా. ఈ విషయాన్ని ఆఫ్రికా దేశాలు గమనించి.. క్రమంగా డ్రాగన్‌ను దూరం పెడుతూ వస్తున్నాయి.

67 ఏళ్లుగా స్వచ్ఛమైన తేనె సేకరణ

తేనెటీగల జీవన విధానాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని అత్యంత నాణ్యమైన తేనె సేకరించడంలో మాదు నాగేశ్వరరావుది అందెవేసిన చేయి. పరిసర ప్రాంతాల్లో పెట్టెలను ఏర్పాటు చేసి 67 ఏళ్లుగా తేనె సేకరించడమే ఆయన వ్యాపకం. నాణ్యత విషయంలో రాజీ పడరు. ఆయన వద్ద నుంచి ఇతర దేశాల్లోని తెలుగు వారు సైతం తేనెను కొనుగోలు చేస్తుంటారు. నాగేశ్వరరావు అనుభవాలు ఆయన మాటల్లోనే...
మా స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు. అత్తవారిది ఈడుపుగల్లు. మాది వ్యవసాయ కుటుంబం. మా ప్రాంతానికి చెందిన శేషాచలం, అప్పారావు, కొల్లి రాజారావు వంటి వారి వద్ద నుంచి మెలకువలు నేర్చుకున్నాను. 1950లో గాంధీజీ తేనె పరిశ్రమను స్థాపించాను. ప్రత్యేకంగా తయారు చేసుకున్న తేనె పెట్టెలు చెట్లు, పండ్లతోటలు, ఇళ్ల పరిసరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. డెల్టా ప్రాంతంలో కన్నా అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన తేనె ఉత్తమం. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో తేనెటీగల సంతతి పెరుగుతుంటుంది. జనవరి నాటికి పెట్టెలు ఇరుకు అవుతాయి. ఈగలను మరో పెట్టెలోకి తరలించటం ద్వారా అవి మరో ప్రాంతానికి వలస వెళ్లకుండా కాపాడుకోవాలి. తద్వారా తేనె ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ ఉండొచ్చు.

గతంలో తేనె పెట్టెలను ఖాదీ గ్రామోద్యోగ మిషన్‌ సబ్సిడీపై ఇస్తుండేది. ప్రస్తుతం బయటి మార్కెట్‌లో కొనుక్కోవాల్సిందే. పంటలపై రసాయనిక పురుగు మందుల వాడకం పెరుగుతున్నందున తేనెటీగల సంఖ్య తగ్గుతున్నది. పుప్పొడి సేకరించే తరుణంలో తేనెటీగలు పురుగుమందుల ప్రభావంతో చనిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో వేప, తాటి గులకల మీది నుంచి మకరందాన్ని సేకరిస్తాయి.  కలప కోసం ఆ చెట్లను నరికేస్తున్నారు. ఆ సీజన్‌లో తేనె అనుకున్నంతగా రావటం లేదు.  ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కొందరు సినిమాతారలకు కూడా తేనె ఇచ్చాను. తొలి రోజుల్లో వీసె తేనె రూ. 12కి విక్రయించటం తెలుసు. ప్రస్తుతం కిలో రూ.260కి ఇస్తున్నాం. తేనె సేకరణలో చాలా మందికి శిక్షణ ఇచ్చాను. మొబైల్‌: 99592 65559.  
 

Monday, 29 January 2018

ముప్ఫై ఏళ్లుగా ఆయన రూపాయి డాక్టరే!

గిరిజన ప్రాంతాల్లో అరకొర వైద్యసదుపాయాలు చదువుకునే రోజుల్నుంచే ఆయన్ను బాధించేవి. దానికోసమే డాక్టర్‌ పట్టా అందుకున్నది మొదలు, ముప్ఫై ఏళ్లుగా మహారాష్ట్ర మారుమూల పల్లెల్లో వైద్యం అందిస్తూ రూపాయి డాక్టర్‌గా పేరు పొందారు రవీంద్ర కోల్హే. ఎంబీబీఎస్‌ తర్వాత ఇంకా పెద్ద చదువు చదివినా, అక్కడే వైద్య సేవలు అందించేలా తన భార్యాపిల్లల్లో స్ఫూర్తి నింపినా అదంతా గిరిపుత్రుల పట్ల ఆయనకున్న ప్రేమకు తార్కాణమే. 


దాదాపు ముప్ఫై ఏళ్ల కిందట నాగ్‌పుర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న రవీంద్ర కొల్హే కోర్సులో భాగంగా ఓ మారుమూల పల్లెలో ఏడాదిన్నరపాటు పనిచేశారు. అదే ఆయన జీవితం మరోలా మలుపు తిరగడానికి కారణమైంది. ఆ ఊరే మహారాష్ట్రలోని టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతమైన మెల్ఘాట్‌లో బైరాఘర్‌ అనే చిన్న గ్రామం. ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లుండే ఈ ప్రాంతంలోనే వైద్యుడిగా స్థిరపడాలనుకున్నారు రవీంద్ర. 1989లో కోర్సు పూర్తయిన వెంటనే బైరాఘర్‌ గ్రామంలో ఒక చిన్న క్లినిక్‌ని ప్రారంభించారు. మెల్ఘాట్‌ పరిధిలో ఉన్న మూడొందల గ్రామాలకూ ఇదొక్కటే ఆసుపత్రి. కొత్త వ్యక్తి కావడంతో మొదట్లో రవీంద్రని చూసి వాళ్లు భయపడి పారిపోయేవారట. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్న రవీంద్రే మెల్లిమెల్లిగా వారిలో నమ్మకాన్ని కలిగించారు. ఇప్పుడా గ్రామాల వారికి ఆయనే మార్గదర్శీ, గురువూ కూడా. వైద్యమైతే ఉచితంగా అందిస్తున్నారు కానీ, స్కానింగులూ, ఎక్స్‌రేలూ లాంటి వాటి కోసం రోజూ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లిరావల్సి వచ్చేది. దీన్ని గమనించిన రవీంద్ర ఎండీ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఒక పరిష్కారాన్ని కనుక్కొన్నారు. ఈ ఆసుపత్రికి మొదటిసారి వచ్చిన వారి నుంచి రెండు రూపాయలూ, ఆ తర్వాత నుంచీ కేవలం ఒక్క రూపాయీ ఫీజుగా తీసుకుంటారు.

ఆ రిపోర్టే కారణం 
రవీంద్ర ఎండీ కోర్సు చేస్తున్న సమయంలోనే మెల్ఘాట్‌లో గిరిజనుల ప్రధాన శత్రువైన పోషకాహారలోపంమీద ఒక నివేదికను తయారు చేశారు. పోషకాహారలోపం, న్యూమోనియా, మలేరియాలాంటి వాటికే సరైన వైద్యం అందక ఇక్కడ ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని దానిలో పేర్కొన్నారు. పంటల సమయంలో తప్ప మిగతా ఏడాదంతా తిండి దొరక్కపోవడం వీరి జీవితాలను ఛిద్రం చేస్తోందని తెలిపారు. బీబీసీ రేడియో ఈ విషయాన్ని ప్రసారం చేసింది. దాంతో ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

వైద్యుడి వ్యవసాయం...
మెల్ఘాట్‌ ప్రాంత గిరిజనుల జీవన ప్రమాణాలు పెరగాలంటే వ్యవసాయమే సరైన మార్గమని భావించి, ఆధునిక వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకోవాలనుకున్నారు. అందుకోసం పంజాబ్‌లోని కృషీ విద్యాపీఠ్‌లో అగ్రికల్చరల్‌ కోర్సు పూర్తి చేశారు. రవీంద్ర నేర్పిన సరికొత్త వ్యవసాయంతో తమ అవసరాలు తీర్చుకోగా మిగిలిన ఉత్పత్తులను అమ్మే స్థాయికి గిరిజనులు చేరుకున్నారు. దీంతో వారి జీవన ప్రమాణస్థాయీ పెరిగింది. ఫలితంగా మొదట్లో 200గా ఉండే శిశుమరణాల రేటు ఇప్పుడు 60కి చేరింది.
అవార్డుతో థియేటర్‌
రవీంద్ర సేవలను గుర్తించిన లోక్‌మత్‌ దినపత్రిక 2011లో లోక్‌మత్‌ మహరాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతోపాటు రూ.15 లక్షల నగదునీ అందించింది. దానితోనే మొదటి ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మించాడు. ఇక్కడ కంటి సమస్యలు అధికంగా ఉండటంతో తన స్నేహితుడితో కలిసి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు.

కుటుంబమంతా....
రవీంద్ర ఎండీ చేస్తున్న సమయంలోనే నాగ్‌పుర్‌కి చెందిన డాక్టర్‌ స్మితను ఇష్టపడ్డారు. అయితే, పెళ్లికి ముందే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఆమెకు స్పష్టం చేశారు. స్మితకి కూడా ఇది నచ్చడంతో లక్షలు అందిస్తున్న ఉద్యోగాన్ని వదిలి, నెలకు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే సంపాదించే రవీంద్ర వెంటనడిచారు. అంతేకాదు, వారి పెద్ద కుమారుడు రోహిత్‌ అగ్రికల్చరల్‌ కోర్సు పూర్తిచేసి అదే ఊరిలో గిరిజనులతో కలిసి వ్యవసాయం చేస్తూ, వారికి మెలకువలు నేర్పుతున్నాడు. ఇక, ఎంబీబీఎస్‌ చదువుతున్న రెండో అబ్బాయి కోర్సు పూర్తయ్యాక ఆ ఆసుపత్రిలోనే సర్జన్‌గా సేవలందించనున్నాడు.
ఒక్క అడుగు చాలు...
ఇప్పుడిప్పుడే ఈయన్ను ఆదర్శంగా తీసుకుంటున్న మూడొందల గ్రామాల యువతా ఆయన అడుగుజాడల్లో నడక సాగిస్తోంది. రవీంద్ర పిలుపు మేరకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, యూత్‌ క్యాంపుల్లాంటి కార్యక్రమాల్లో మెల్ఘాట్‌తోపాటు ఇతర ప్రాంతాలకు చెందినవారూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మెల్ఘాట్‌లోని ప్రస్తుత ఆసుపత్రిని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే కాకుండా, గిరిజన యువతను సర్కారు కొలువులు అందుకునేలా సంసిద్ధం చేసేందుకు ఉచితంగా కోచింగ్‌ సెంటర్లను ఏర్పరచడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాలంటున్నారు రవీంద్ర.

డాబా మీద పండించేద్దాం!

చిన్నప్పుడు అమ్మ చందమామని చూపించి గోరుముద్దలు తినిపించిన డాబా పతంగులు ఎగరేస్తూ మెట్ల మీద పడి దెబ్బలు తగిలించుకున్న డాబా 
చదువు వంక పెట్టి పక్కింటమ్మాయిని చూడ్డానికి ఇష్టంగా ఎక్కిన డాబా 
పెళ్లయ్యాక నెచ్చెలితో స్వీట్‌ నథింగ్స్‌ చెప్పుకున్న డాబా 
కుటుంబమంతా కలిసి వెన్నెల్లో కబుర్లు కలబోసుకున్న డాబా. 
మేడ, మిద్దె డాబా... పేరేదైనా దానితో అనుబంధం మాత్రం ఎవరికి వారికే ప్రత్యేకం. ఇప్పుడా డాబానే ఒత్తిడిని మాయం చేసే చలువ పందిరి అవుతోంది. కూరగాయలు పండించే మిద్దె తోటై మురిపిస్తోంది. 


ఒకప్పుడు డాబా మీదికి వెళ్తే... ఓ పక్కన మెట్ల మీదుగా పైకి పాకిన సన్నజాజి తీగ విరబూసి కన్పించేది. పెరటి వైపునుంచీ సపోటా చెట్టు కొమ్మో, జామచెట్టు కొమ్మో పలకరించేవి. కొబ్బరాకులు గాలికి ఊగుతూ చీకట్లో భయపెట్టేవి. పక్కింటి వారి మామిడి కొమ్మ ఒకటి అలా అందీ అందనట్లు పిట్టగోడను తాకుతుంటే లేత పిందెలు ఊరించేవి. చాపో పరుపో వేసుకుని పడుకుంటే పైన చందమామా చుట్టూ చల్లని గాలీ... హాయిగా నిద్రపట్టేసేది.
ఇప్పుడో... నీళ్ల ట్యాంకులకు తోడు రకరకాల సైజుల్లో డిష్‌ యాంటెన్నాలూ, స్విచ్‌బాక్సులూ, సెల్‌ఫోన్‌ టవర్లూ, కేబుల్‌ వైర్లతో గందరగోళానికి అర్థంలా ఉంటాయి డాబాలు. అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించే తీరికా, శుభ్రంచేసి ఉపయోగించుకునే ఓపికా ఉన్నవారు అదృష్టవంతులే. ఇక అపార్ట్‌మెంట్లకైతే పైకప్పు మీద ఏ ఒక్కరి హక్కూ ఉండదు. అది సమష్టి సొత్తు కావడంతో ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్లు తయారైంది నగరాల్లో డాబాల పరిస్థితి.
ఒక్క హైదరాబాదునే తీసుకుంటే అక్కడ ఉన్న భవనాల పైకప్పు దాదాపు 40వేల ఎకరాల వైశాల్యం ఉంటుందట. అందులో సగం విస్తీర్ణాన్ని కూరగాయల పెంపకానికి ఉపయోగించినా ఎన్నో సమస్యలు తీరతాయంటున్నారు ఉద్యానవన నిపుణులు. రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ వాడని తాజా కూరగాయలు తక్కువ ఖర్చులో లభిస్తాయి. కేవలం 200చ.మీ. స్థలం ఉంటే అందులో ఒక్క కూరగాయలే కాదు, పండ్లూ, పూలూ చాలా పండించవచ్చు.

క్రీస్తు పూర్వమే... 
డాబాపైన మొక్కలు పెంచడమనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. క్రీస్తుపూర్వం మెసపొటేమియా నాగరికత నాటికే ఈ పద్ధతి ఉందట. భవనం అందంగా కనిపించడం కోసం రోమన్లు ముందువైపు ఇంటి పైకప్పు ప్రత్యేకంగా కట్టించి దాని మీద మొక్కలు పెంచి పూల తీగెలు కిందికి వేలాడేలా చేసేవారట. రోమ్‌, ఈజిప్టు లాంటి చోట్ల పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పలు భవనాల్లో ఇలాంటి పైకప్పు తోటలు కన్పించాయని చరిత్ర చెబుతోంది. పురాతన ప్రపంచానికి చెందిన ఏడు వింతల్లో ఒకటైన హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ కూడా ఎత్తైన భవనాల మీద పెంచిన తోటలే.
ఇప్పటికీ చాలా దేశాల్లోని నగరాల్లో చల్లదనం కోసమూ, మొక్కలు పెంచాలన్న కోరిక ఉండీ స్థలం లేనప్పుడూ డాబాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా లతలూ పూల మొక్కలకూ ప్రాధాన్యమిస్తున్నారు. గుబురుగా పచ్చని పొదలుగా ఎదిగే మొక్కల్నే పెంచుతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు సరదాగా ఒకటీ అరా హైబ్రిడ్‌ పండ్లమొక్కలను పెంచినా కూరగాయల పెంపకానికి డాబాలను వాడడం అంతగా లేదు. అలాంటిది వాటి మీద కూరగాయలను పెంచడం ఈ మధ్య కాలంలోనే మొదలైంది. కొంతకాలం క్రితం వరకూ అక్కడక్కడా మాత్రమే కన్పించిన ఈ మిద్దె తోటలు సోషల్‌ మీడియావల్ల త్వరగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌, వైజాగ్‌ లాంటి నగరాల్లోనే కాక భద్రాచలం,నల్గొండ , కొత్తవలస లాంటి పట్టణాల్లోనూ వందలాది ఔత్సాహికులు మిద్దెతోటలను పెంచుతున్నారు.
ప్రయోజనాలు ఎన్నో! 
మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు. దానికి తోడు మిద్దెతోటల ప్రయోజనాలు తెలియడంతో మరింత ఎక్కువగా వాటిని పెంచడానికి ఇష్టపడుతున్నారు. ‘తాజాగా అప్పటికప్పుడు మొక్కలనుంచి కోసి వండుకుంటుంటే ఆ ఆనందమే వేరు’ అంటారు సికింద్రాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన సూర్యకుమారి. ‘బజారులో ఏం కొన్నా వాటి మీద ఏ పురుగు మందులు చల్లారో, ఎన్ని రసాయన ఎరువులు వాడారోనన్న సందేహం వదలదు. పైగా పండ్లను మగ్గబెట్టడానికీ రసాయనాలను వాడుతున్నారు. ఆ భయాలు లేకుండా కూరగాయలనూ, పండ్లనూ ఇంటిమీదే చక్కగా పండించుకోవచ్చు’ అంటారామె. మొక్కలు పెంచడం ఆమెకు చిన్నప్పటినుంచీ ఇష్టమే. ఉద్యోగరీత్యా ఇన్నాళ్లూ సాధ్యం కాని ఆ కోరికను ఇపుడు సొంతింటి మీద తోట పెంచి తీర్చుకుంటున్న సూర్యకుమారి 900 చదరపు అడుగుల డాబా మీద నలుగురు మనుషులకు సరిపోను కూరగాయలను తేలిగ్గా పండించగలుగుతున్నారు. పువ్వులంటే ఇష్టంతో ఏకంగా 30 రకాల మందారాలను తమ తోటలో పూయిస్తున్నారామె.
అరటి, మామిడి లాంటి పండ్లమొక్కల్నీ, ఔషధ మొక్కల్నీ కూడా పెంచుతున్నారు సఫీల్‌గూడ అనంతనగర్‌ కాలనీకి చెందిన కొలను పద్మావతి. మొదట పూలమొక్కలు పెంచిన ఆమె ఫేస్‌బుక్‌ మిత్రుల స్ఫూర్తితో కూరగాయలూ ఆకుకూరలూ పండించడం మొదలుపెట్టారు. తమ కుటుంబానికి సరిపోగా చుట్టుపక్కలవారికీ పంచుతున్నారు పద్మావతి. సొంతింటి డాబాని ఇంత బాగా ఉపయోగించుకోవడం తనకెంతో తృప్తినిస్తోందంటారామె.
డాబా తోటల వల్ల వ్యక్తిగతంగానే కాదు సమాజానికీ ప్రయోజనం ఉందంటారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. ఆయన సింగరేణి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడాలనుకున్నప్పుడు నగరంలో అపార్ట్‌మెంట్‌కన్నా శివార్లలో సొంత ఇల్లు కట్టుకోవడానికే మొగ్గు చూపారు. అందుకు కారణం మొక్కల పెంపకం పట్ల ప్రేమే. ఇల్లు పూర్తికాగానే తోటపనీ ప్రారంభించారు. దాదాపు 1230 చదరపు అడుగుల తోటలో కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లూ పండిస్తున్నారు. 8 అంగుళాల మడి లోతులో 20 అడుగుల పొడవు బొప్పాయిని పెంచారాయన. ఏడేళ్లుగా బయట కూరగాయలు కొనలేదని గర్వంగా చెప్తారు. ఆయన తోటలో సపోటా, అంజీర, నారింజ లాంటి పండ్లే కాదు ఆవాలు కూడా పండిస్తారు. ‘మిద్దెతోట’ పేరుతో తన అనుభవాలను క్రోడీకరించి ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఓ పుస్తకం రాశారు రఘోత్తమరెడ్డి.

వేడీ కాలుష్యమూ తగ్గుతాయి
‘నగరాలను కాంక్రీట్‌ అరణ్యాలంటారు కదా... ఆ ప్రభావం తగ్గడానికి అత్యంత చౌక విధానం మిద్దెతోటల పెంపకం’ అనే రఘోత్తమరెడ్డి అందుకు కారణాలూ వివరిస్తారు. డాబాలన్నీ తోటలైతే ఎటుచూసినా హాయి గొలిపే పచ్చదనమే కన్పిస్తుందనీ, పైకప్పులన్నీ చల్లగా ఉండడం వల్ల ఇళ్లలో ఏసీల వాడకం తగ్గుతుందనీ అంటారు. కాలుష్యం తగ్గుతుంది. చల్లని శుభ్రమైన గాలి వస్తుంది. రూఫ్‌ గార్డెన్ల నిర్వహణ ఖర్చూ తక్కువే. ఒక్కసారి కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే చాలు, ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందవచ్చు. రాలిన ఆకులూ అలములతోనే ఎరువు తయారవుతుంది. చేసే శ్రమ వ్యాయామం అవుతుంది.మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోటలను పెంచుతున్నవారి మాటలే కాదు, అధ్యయనాలూ ఈ విషయాలను రుజువు చేస్తున్నాయి.
అమెరికాలోని షికాగో సిటీ హాల్‌ రూఫ్‌ గార్డెన్‌కి పేరొందింది. రూఫ్‌ గార్డెన్‌ వల్ల ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం తేడాలు ఉంటాయో పరిశీలించడానికి శాస్త్రవేత్తలు ఆ భవనంలో ప్రయోగాలు చేశారు. వారి పరిశీలనలో తేలిందేమిటంటే- రూఫ్‌ గార్డెన్‌ ఉన్న భవనానికీ లేని భవనానికీ ఉష్ణోగ్రతలో 10డిగ్రీల సెల్సియస్‌ (50 డిగ్రీల ఫారెన్‌హీట్‌) తేడా ఉందని. సాధారణంగానే పట్టణాలూ నగరాల్లో చెట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి శివార్ల కన్నా అక్కడ 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందంటారు. అర్బన్‌ హీట్‌గా పేర్కొనే ఈ అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి డాబా తోటలు బాగా పనికొస్తాయంటున్నారు నిపుణులు.

ఇలా చేయవచ్చు!
డాబా మీద తోట పెంచాలనుకునేవారు ఒక్కో మొక్కా పెట్టుకుంటూ నెమ్మదిగా పెంచుకోవచ్చు. లేదంటే ఒకేసారి అందుబాటులో ఉన్న స్థలాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తోటగా అభివృద్ధి చేసుకోవచ్చు. తోట వల్ల భవనానికి నష్టం జరగదు. ఎలాంటి డాబా అయినా తోటను మోయగల సామర్థ్యం ఉంటుంది. డాబా మీద తోటకి 8 అంగుళాల మందంలో మట్టి చాలు. భవనం బీమ్‌లను బట్టి వెడల్పుగా మడులు కట్టుకుంటే ఆ బరువు సమంగా వ్యాపిస్తుంది. మట్టిని డాబా నేల మీద నేరుగా పోయకుండా ప్లాస్టిక్‌ టబ్బుల్లో, తొట్లలో, కాంక్రీట్‌తో ప్రత్యేకంగా కట్టిన మడుల్లో పోసి మొక్కలు పెంచుతారు కాబట్టి నీరు కానీ మొక్కల వేళ్లు కానీ కప్పులోకి వెళ్లడమనేది ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు తోటను కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్లుగా కట్టుకుంటే మంచిదంటారు రఘోత్తమరెడ్డి. ఆయన తోటపనిని ఒక కళలాగా సాధన చేస్తున్నారు. కుండీలకు ఎర్రరంగు వేసి ముగ్గులతో తీర్చిదిద్దుతారు. మొక్కల మధ్య టెర్రకోట బొమ్మల్ని అందంగా అలంకరిస్తారు. ఏడాదికోసారి మొక్కల వేళ్లు దెబ్బతినకుండా పైపైన మట్టిని కాస్త పెళ్లగించి తీసి ఆ మేరకు కొత్త మట్టిని చేరిస్తే చాలు, ఏడాదికి రెండు పంటలు తేలిగ్గా పండించుకోవచ్చంటున్నారు ఈ అనుభవజ్ఞులంతా. 

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వాలూ ఉద్యానశాఖల ద్వారా ఆసక్తిగల వారికి శిక్షణ ఇచ్చి, కిట్లనూ సరఫరా చేస్తున్నాయి.
ఇంటి మీద ఓ తోట ఉంటే...
ఉదయమే పక్షుల కిలకిలారావాలు వినవచ్చు.
లేలేత ఆకులపై మంచుబిందువుల్లో ప్రతిఫలించే తొలి కిరణాల సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
ఇక తోటపనితో ఒంటికి వ్యాయామమూ,
మనసుకు ఉల్లాసమూ లభిస్తాయి.
మొత్తం మీద మిద్దెతోటల పెంపకం ఓ ఆరోగ్యకరమైన కాలక్షేపం.
మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఓ మొక్క నాటి, రేపటి తోటకు శ్రీకారం చుట్టేయండి.

మన ఇల్లూ -మన కూరగాయలూ
నగరాల్లో నివసించేవారు ఇంటివద్దే కూరగాయల్ని పెంచుకునేలా ప్రోత్సహించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరిది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన అనే పథకం కింద దీనికి ప్రభుత్వం ఆర్థికసాయమే కాకుండా అవసరమైన వస్తువులనూ అందజేస్తుంది.
సహాయం పొందడానికి అర్హతలు: కనీసం 50 - 200 చదరపు
అడుగుల మధ్య స్థలం(బాల్కనీ, ఇంటి పైకప్పు, పెరడు ఏదైనా సరే) ఉండాలి. ఆసక్తి కలవాళ్లెవరైనా తమ చిరునామా, పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఉద్యానవనశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏమిస్తారంటే: ప్రస్తుతం ఉద్యానవనశాఖ రెండురకాల కిట్లను ఇస్తోంది. ఇంటికి రెండు కిట్లతో పాటు ఉచితంగా సాగులో శిక్షణ కూడా ఇస్తుంది. కిట్‌ ‘ఎ’ యూనిట్‌ ధర రూ.6 వేలు. 50శాతం సబ్సిడీ.
కిట్‌ ‘బి’ ధర రూ.1900. పెరట్లో సాగు చేయాలనుకునేవారికి మట్టి మిశ్రమం అవసరం ఉండదు కాబట్టి మరింత తక్కువ ధరకే ఈ కిట్లు లభిస్తాయి.
సిల్పాలిన్‌ కవర్లు, గ్రోబ్యాగ్స్‌, మట్టి మిశ్రమం, విత్తనాలు, వేపపిండి, వేపనూనె, తోటపనికి అవసరమైన ఇతర పనిముట్లు... ఈ కిట్లలో ఉంటాయి.
పూర్తి సమాచారం ...
http:///horticulture.tg.nic.in వెబ్‌సైట్‌లోని అర్బన్‌ ఫామింగ్‌ విభాగంలో చూడవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలుగా దరఖాస్తు ఫారం కూడా అందులోనే ఉంది.

మంచు.. వాహనం ఢీకొని సైక్లిస్టు దుర్మరణం

చిట్యాల: మంచు కారణంగా రహదారిపై ముందు ఉన్నది ఏదీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లిలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. సైకిల్‌పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని కంకల వెంకటేశ్(30)గా గుర్తించారు.

Padma award selection process transformed, common people being honoured: PM Modi

NEW DELHI: Prime Minister Narendra Modi on Sunday said his government had transformed the process for selecting Padma award winners and common people were now being honoured because the emphasis was no longer on the name of a nominee, but on the work done.
In the year's first 'Mann ki Baat' address, PM Modi said the awards are being bestowed on people "who do not live in big cities and are not visible in newspapers and TV".

"Making the (nomination) process online has led to transparency. The selection process for these awards has undergone a transformation," he said.

People were being honoured without a recommendation, he stressed in his monthly radio programme.



"If you look at these winners, you will feel proud that such kind of people live in society and will also naturally feel proud that they are getting this recognition without any 'sifarish' (recommendation)," he said.

"Now the identity of the awardee is not the deciding factor of the award, rather the importance of his work is increasing," he said.

The prime minister also highlighted the works of some of this year's winners, whose names were announced on the eve of Republic Day, and said they should be invited to schools and colleges so that they could share their experiences and inspire others.

He mentioned that this year's Padma awardees include Lakshmikutty, a tribal woman from Kerala who prepares herbal medicines, and Arvind Gupta, an IIT Kanpur alumnus who inspired generations of students to learn science from trash.

Society should also go beyond these awards and make efforts to recognise people working selflessly, he said.

PM Modi began his address by noting that for the first time heads of 10 countries were present as guests during the Republic Day parade in the national capital on January 26.

Lauding woman power and highlighting a letter posted on his app by a citizen, he pointed out that astronaut Kalpana Chawla's death anniversary falls on February 1 and her life had inspired lakhs of young people.

She gave the message that there is no limit to woman power, he said, adding thatwomen in India were moving forward in every field and making the country proud.

PM Modi said women's achievements and place in society in ancient India had surprised the world and quoted a 'shloka' which said one daughter was equal to 10 sons.

Quoting the letter, which also mentioned Defence Minister Nirmala Sitharaman's sortie in fighter aircraft Sukhoi 30, he said women were not only moving ahead in every field but leading there as well.

In this context, the prime minister also referred to President Ram Nath Kovind's initiative to meet a group of "extraordinary" women, who were all path-breakers, and said women had broken through orthodoxy to achieve "extraordinary success".

Kovind had recently met India's first woman merchant navy captain, the first woman passenger train driver and fire fighter, among others, he said, calling them the "first ladies" in their respective fields.

A book on these woman achievers was available on his website, he said.

"Women are playing a significant role in the positive changes happening in the country," he said, and referred to the performance of an all-woman BSF biker contingent at the Republic Day parade, which, he said, "surprised" guests from India and abroad.

PMModi highlighted woman e-rickshaw drivers working in a naxalite-hit district of Chhattisgarh, saying they were helping transform the troubled region. He also referred to the Matunga Railway Station in Mumbai which had an all-woman staff.

In In the radio broadcast, the prime minister spoke about the strength of the Indian civilisation and praised its qualities of flexibility, self-correction and ability for transformation.


"Our society has always made efforts to get rid of its ills," he said.

The prime minister referred to the world's longest human chain of 13,000km formed in Bihar against dowry and child marriage and said it was imperative that society was rid of such ills.

PM Modi also recalled Mahatma Gandhi, whose death anniversary is on January 30, and said his path of peace and non-violence was applicable to all, just as his ideals were as relevant as ever.
What can be a bigger tribute than taking a vow that we shall tread the path of Bapu and walk, as far as possible," he said.


Moving on to health, PM Modi said medicines at the government's 'Jan Aushadhi Centres' were 50-90 per cent cheaper than market rates, and said these were making healthcare more affordable.
Noting the participation of people of Indian origin who were elected representatives in various countries at an event here to mark 'Pravasi Bharatiya Divas', he said people of Indian origin served their adopted countries and at the same time maintained a strong bond with India.


The European Union, he said, has sent him a calendar in which contributions by Indians living in different parts of Europe in various fields of life had been highlighted.

అమెరికాలో.. సిద్దిపేట టెకీ అనుమానాస్పద మృతి

సిద్దిపేట కల్చరల్‌, జనవరి 28: సిద్దిపేటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానిక మారుతి నగర్‌ కాలనీకి చెందిన వెంకన్నగారి శ్రీనివాసులు, రాణి దంపతుల చిన్న కుమారుడు కృష్ణ చైతన్య (28) నాలుగేళ్ల క్రితం కాగ్నిజెంట్‌ సంస్థలో ఆన్‌సైట్‌ ఉద్యోగిగా అమెరికా వెళ్లారు. ఆయన ఇటీవలే డల్లా్‌సలోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో చేరారు. ఓ పేయింగ్‌ గెస్ట్‌హౌ్‌సలో ఉంటున్నారు. ఈ నెల 26న తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన కృష్ణచైతన్య.. తనకు తలనొప్పిగా ఉందని, ఉదయం మాట్లాడతానని ఫోన్‌ పెట్టేశాడు. ఈ నెల 27న అతను తన గది తలుపులు తెరవకపోవడంతో.. గెస్ట్‌హౌస్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.


 
తలుపులు తెరిచి లోనికి వెళ్లిన పోలీసులకు.. కృష్ణచైతన్య విగతజీవిగా కనిపించారు. కాగా.. కృష్ణచైతన్య బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయన మరణానికి ఆ వ్యాధే కారణమా? లేక మరేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. కృష్ణచైతన్య మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తెప్పించేలా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌.. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. గురువారానికి మృతదేహాన్ని భారత్‌కు తరలిస్తామని ఎన్‌ఆర్‌ఐ విభాగం అధికారులు తెలిపారు.

దెయ్యాన్ని పెళ్లి చేసుకున్న యువతి!

డబ్లిన్‌ః కొన్ని స్టోరీలు అంతే.. చదవడానికి వింతగా ఉంటాయి. అసలు నమ్మశక్యంగా కనిపించవు. నిజంగా ఇలాంటివి జరుగుతాయా అనిపిస్తుంది. అలాంటిదే ఈ స్టోరీ. ఐర్లాండ్‌లో అమందా అనే ఓ యువతి 300 ఏళ్ల కిందట చనిపోయిన ఓ హైతీ పైరేట్ ఆత్మను పెళ్లి చేసుకుంది. 2016 జులైలో చట్టబద్ధంగా జాక్ టీగ్ అనే ఆ పైరేట్ ఆత్మను పెళ్లి చేసుకున్నట్లు అమందా చెప్పుకుంటున్నది. అతను 1700 కాలంలోనే చనిపోయాడు. మరీ విస్తుగొలిపే విషయం ఏమిటంటే తన జీవితంలో అతనితో ఎంజాయ్ చేసినట్లుగా సెక్స్‌ను ఇంకా ఎవరితోనూ చేయలేదని అమందా చెప్పడం. నిజానికి యూకే లేదా ఐర్లాండ్‌లో ఇలా ఆత్మలను పెళ్లికోవడాన్ని ప్రభుత్వం గుర్తించదు. దీంతో గతేడాది అక్టోబర్‌లో అట్లాంటిక్ మహా సముద్రం మధ్య తన స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి జాక్ ఆత్మను పెళ్లి చేసుకుంది అమందా. 


ఐర్లాండ్‌లోని డ్రోగెడాలో తన ఇంట్లో ఉండగా ఈ ఆత్మతో పరిచయం ఏర్పడినట్లు అమందా చెబుతున్నది. ఆరు నెలల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నామని అనుకున్నాక పెళ్లి చేసుకుందామని డిసైడయ్యారు. మిగతా సాధారణ సంబంధాల్లోలాగే వీళ్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు.. వీకెండ్స్‌లో కలిసి సినిమాలకు, షికార్లకు తిరుగుతారట. అసలు మా మధ్య కెమెస్ట్రీ అదుర్స్ అంటున్నది అమందా. యూకే లేదా ఐర్లాండ్‌లో ఇలా ఆత్మలను పెళ్లి చేసుకోవడాన్ని గుర్తించకపోయినా కొన్ని దేశాలు, సామాజిక వర్గాల్లో ఇది చట్టబద్ధం. ఫ్రాన్స్‌లోనూ దీనికి చట్టబద్ధత ఉంది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో వందల మంది మహిళలకు యుద్ధంలో చనిపోయిన తమ భాగస్వాముల ఆత్మలను పెళ్లి చేసుకునే అవకాశం అక్కడి ప్రభుత్వం కల్పించింది.

తలను వేరు చేసి.. నల్గొండలో మరో హత్య


నల్లొండ: వరుస హత్యలతో నల్గొండ పట్టణం వణికిపోతోంది. కొద్దిరోజుల క్రితమే నల్గొండ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ హత్యకు గురైన ఘటన మరువక ముందే పట్టణంలో మరో హత్య జరగడం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ప్రకాశం బజార్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.  ప్రకాశం బజార్ సమీపంలో బొట్టుగూడలో ఓ దర్గా జెండా వద్ద తలను చూసి భయాందోళనకు గురైన స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. నల్గొండ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. డాగ్ స్కాడ్ ద్వారా పట్టణ శివారులోని భారత్ గ్యాస్ గోదాం సమీపంలో మొండాన్ని గుర్తించారు. మృతుడిని కనగల్‌కు చెందిన పాలకూరి రమేష్‌గా గుర్తించారు. మృతుడు డ్రైవర్‌గా పని చేస్తున్నాడని.. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులు మద్యం సేవించి హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Sunday, 28 January 2018

హైదరాబాద్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన పొగమంచు

కాచిగూడ: పొగమంచు హైదరాబాద్‌ వాసులను ఉక్కిరిబిక్కిరిచేసింది. సోమవారం ఉదయం దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కనుచూపు మేర ఏమీ కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. అంబర్‌పేటలోని ముసారాబాగ్‌ రహదారి వంతెనపై సోమవారం తెల్లవారు జామున కనిపించిన చిత్రాలివి.

పాక్‌ చేతికి చైనా ఆయుధ డ్రోన్‌..!

న్యూదిల్లీ: పాకిస్థాన్‌ చేతికి చైనా నుంచి ప్రమాదకరమైన ఒక ఆయుధం అందినట్లు భారత నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. చైనాకు చెందిన వింగ్‌లూంగ్‌-1 అనే ఆయుధ డ్రోన్‌ ఒకటి పాకిస్థాన్‌కు చెందిన ఎంఎం ఆలమ్‌ వాయుసేన స్థావరంలో ఉన్నట్లు నిఘావర్గాలు నిర్ధరించుకున్నాయి. ఈ మానవ రహిత విమానం ద్వార 100 కిలోలబరువైన బాంబులు, క్షిపణులను ప్రయోగించవచ్చు. 20 గంటలపాటు 5000 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలదు. దీంతో భారత రాడార్లు అప్రమత్తమయ్యాయి.
 2017 నవంబర్‌లో ఎంఎం ఆలమ్‌ ఎయిర్‌పోర్టును ఒక ఉపగ్రహం చిత్రీకరించింది. ఈ సందర్భంగా అక్కడ నిలిపిఉన్న వింగ్‌లూంగ్‌ డ్రోన్‌ను కూడా చిత్రీకరించింది. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన బార్డ్‌ కాలేజ్‌లోని డ్రోన్‌ అధ్యయన కేంద్రం విశ్లేషించింది. దాదాపు 14మీటర్ల  పొడవున్న రెక్కలు.. వీఆకారంలోని తోక ప్రపంచంలో వింగ్‌ లూంగ్‌-1 డ్రోన్లకు తప్ప మరే ఇతర డ్రోన్లకు లేదు. 2016లో ఒక వింగ్‌లూంగ్‌ డ్రోన్‌ ఒకటి ఆలమ్‌ స్థావరం వద్ద కూలిపోయింది. దీంతో చైనాడ్రోన్లను పాక్‌ వినియోగిస్తున్నట్లు నిర్ధరించుకున్నారు.
చైనా అండతో పాకిస్థాన్‌ మూడు రకాల డ్రోన్లను వినియోగిస్తోంది. ఫాల్కో, షాఫార్‌, బుర్రాక్‌ శ్రేణి డ్రోన్లను వాడుతోంది. వీటిలో బుర్రాక్‌ డ్రోన్లు దాడులు కూడా చేయగలవు. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. చైనా వద్ద వింగ్‌ లూంగ్‌-1, వింగ్‌లూంగ్‌-2, డబ్ల్యూజే-600ఏడీ, యాంగ్‌ క్లౌడ్‌ షాడో, రెయిన్‌బో వంటి డ్రోన్లు ఉన్నాయి.
మరోపక్క భారత్‌ కూడా ఆయుధ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన ప్రిడేటర్లు, రేపర్ల కోసం బేరసారాలను నిర్వహిస్తోంది. మరోపక్క నిఘా కోసం ఇజ్రాయిల్‌కు చెందిన హెరాన్లను వినియోగిస్తోంది 

ఎంఆర్‌ఐ మెషిన్‌లో చిక్కుకుని యువకుడి మృతి

ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. ఎంఆర్‌ఐ మెషిన్‌లో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజేశ్‌ మురు తల్లి నాయర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమెను చూడటానికి శనివారం సాయంత్రం రాజేశ్‌ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ సమయంలో వార్డ్‌బాయ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఎంఆర్‌ఐ గదికి తీసుకురమ్మని అతడ్ని కోరాడు. సిలిండర్‌తో రాజేశ్‌ వెళ్లిన వెంటనే స్కానింగ్‌ రూమ్‌లో ఎంఆర్‌ఐ మెషిన్‌కు ఉన్న అయస్కాంత శక్తి ఒక్కసారిగా అతడ్ని లాగింది. ఈ ప్రమాదంలో రాజేశ్‌ మెషిన్‌లో చిక్కుకుని, 2 నిమిషాల వ్యవధిలో మృతి చెందాడు.

Friday, 26 January 2018

EARN MONEY CLICK HERE


దాని వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరం

ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకరం






జూబ్లీహిల్స్‌: విచ్చలవిడి ప్లాస్టిక్‌ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖ నటి, మాజీ మిస్‌ ఇండియా జూహీచావ్లా అన్నారు.  ఫిక్కీ యంగ్‌లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌వో ) ఆద్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీరు తాగడం కేన్సర్‌కు దారితీస్తుందని గుర్తు చేసారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్‌ సంద్యారాజు, మోడల్‌ శిల్పారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. 

శ్రీనివాస్‌ హత్యకేసులో నిందితుల లొంగుబాటు

నల్గొండ : బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్‌లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు జాగ్రత్తగా విచారిస్తున్నారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెల్సిందే. నల్లగొండలోని గాంధీనగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్‌ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
 తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్‌లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్‌ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్‌ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

x