Friday, 23 February 2018

మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం


మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం :   ప్రభుత్వం 

దిల్లీ: మోసపూరిత పథకాలతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని, పరారయ్యే వ్యాపారులకు అడ్డుకట్ట పడనుంది. స్థిరాస్తి, బంగారు ఆభరణాల వ్యాపారులు ‘కచ్చితమైన ప్రతిఫలం’ అందిస్తామని ప్రకటిస్తే, వాటిని సామూహిక మదుపు పథకాలుగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
* స్థిరాస్తి అభివృద్ధి సంస్థ కనుక, కొనుగోలుదార్లకు సదరు ఆస్తిని బదలాయించే వరకు ‘స్థిర ప్రతిఫలం అందిస్తామనే’ హామీపై నగదు వసూలు చేస్తే, వాటిని ‘అనియంత్రిత డిపాజిట్లు’గా పరిగణించనున్నారు. ఎక్కువమంది స్థిరాస్తి వ్యాపారులు 9-14 శాతం మొత్తం ప్రతిఫలం ఇస్తామని చెబుతూ, డిపాజిట్‌ రూపేణ నగదు జమ చేసుకుంటున్నారు. మరికొందరు అభివృద్ధిదారులు కూడా కనీసం 10 నెలల పాటు వాయిదాల్లో నగదు చెల్లించాలని కోరుతున్నారు. అనంతరం, డిపాజిట్ల కాలావధికి అనుగుణంగా, నెలవారీ మొత్తంపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇవన్నీ అనియంత్రిత డిపాజిట్ల కిందకే వస్తాయి. అధిక కేసుల్లో స్థిరాస్తి అభివృద్ధి దారులు ప్రారంభంలో కొన్ని నెలల వాయిదాలు చెల్లిస్తారు. అనంతరం వారు చెల్లింపులు ఆపేస్తారు. ఇలాంటివి చట్టం ద్వారా నియంత్రించాల్సి ఉంది. 
* ఇదేవిధంగా ఆభరణాల విక్రేతలు కూడా ‘11 నెలల పాటు నెలసరి వాయిదాలు చెల్లించండి, 12న వాయిదాను మా సంస్థ జమచేస్తుంది. ఈ 12 నెలల మొత్తాన్ని వినియోగించుకుని, మా విక్రయశాలోనే ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు’ అని ప్రకటిస్తున్నాయి. 
ఈ రెండు రకాల డిపాజిట్లు ‘అనియంత్రిత డిపాజిట్ల నిషేధ బిల్‌-2018’ పరిధిలోకి రానున్నాయి. మార్చి 5న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. మోసపూరిత సామూహిక మదుపు పథకాలపై ఉక్కుపాదం మోపడమే ఈ బిల్లు లక్ష్యం. నియంత్రణ, అనియంత్రణ పద్ధతుల్లో డిపాజిట్లు వసూలు చేసేవారంతా, సంబంధిత అధీకృత అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేయకుండా పథకాల రూపేణ నగదు వసూలు చేస్తే, ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించింది.


5 మిలియన్‌ డాలర్లు బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించిన సినిమా .........

5 మిలియన్‌ డాలర్లు  బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించిన సినిమా .........  
ఒక సినిమా బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించడమంటే మాటలా..?. అదీ ఓ తొలి చిత్ర దర్శకుడు పెద్దగా పేరు లేని నటులతో అతి తక్కువ వ్యయంతో తెరకెక్కించిన సినిమా అంతటి విజయం అందుకుందంటే ఎంత ఆశ్చర్యం! అంతేకాదు, గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అంతటితో అయిపోలేదు... ఆస్కార్‌ బరిలోనూ నాలుగు ప్రధాన నామినేషన్లు అందుకుని సత్తా చాటింది. ఆస్కార్‌ చరిత్రలో ఓ హారర్‌ సినిమా ఉత్తమ చిత్రం పురస్కారం కోసం పోటీపడటం చాలా అరుదు. ఆ ఘనత అందుకున్న చిత్రమే ‘గెటవుట్‌’. ఆఫ్రికన్‌ అమెరికన్‌ దర్శకుడు జోర్డాన్‌ పీలె తెరకెక్కించిన ఈ చిత్రంలో డేనియల్‌ కలూయ, అలిసన్‌ విలియమ్స్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ విశేషాలివీ.
హాలీవుడ్‌లో 5 మిలియన్‌ డాలర్లు అంటే చాలా తక్కువ బడ్జెట్‌ కిందే లెక్క. అంతే వ్యయంతో కేవలం 23 రోజుల్లో ‘గెటవుట్‌’ను తెరకెక్కించాడు దర్శకుడు జోర్డాన్‌. అయితే విడుదలయ్యాక మాత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిందీ చిత్రం. సుమారు 255 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా టైమ్‌ మ్యాగజైన్‌, అమెరికన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ ఈ సినిమాను ఎంపిక చేశాయి. గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా లాంటి చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి నామినేషన్లు, ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆస్కార్‌ బరిలోనూ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే లాంటి ప్రధాన విభాగాల్లో పోటీపడుతోంది. ఓ హారర్‌ సినిమా ఈ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకోవడం విశేషమే.
కథేంటి: నల్లజాతీయుడైన ఫొటోగ్రాఫర్‌ క్రిస్‌ వాషింగ్టన్‌(డేనియల్‌), శ్వేతజాతీయురాలైన తన ప్రియురాలు రోజ్‌(అలిసన్‌)తో కలసి ఓ మారుమూల ఉన్న వాళ్ల ఇంటికి వెళ్తాడు. నల్లజాతీయులను ద్వేషించే రోజ్‌ తల్లిదండ్రులు, సోదరుడు క్రిస్‌తో సరిగా మాట్లాడరు. ఇంట్లో పనిచేసే నల్లవారూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. క్రిస్‌ పొగతాగే అలవాటును హిప్నోథెరపీ ద్వారా పోగొడతానని చెప్పి రోజ్‌ తల్లి అతనిపై హిప్నాటిజం చేస్తుంది. దీంతో అతడు ఓ శూన్య ప్రపంచంలోకి జారిపోతాడు. అక్కడ అతనికి బాల్యంలో జరిగిన ఓ దుర్ఘటన కనిపిస్తుంది. పీడకల నుంచి తేరుకున్నట్లుగా మేల్కొన్న క్రిస్‌కు సిగరెట్లపై విరక్తి ఏర్పడుతుంది. కానీ ఇంట్లో వాతావరణం విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఆ ఇంటికి ఓ పార్టీకి వచ్చిన కొందరు శ్వేతజాతీయులు, క్రిస్‌ ఫొటోగ్రఫీ ప్రతిభ చూసి అబ్బురపడతారు. అంధుడైన జిమ్‌ హుడ్సన్‌, లోగన్‌ కింగ్‌ అనే నల్లజాతీయుడు కూడా పార్టీకి వచ్చిఉంటారు. లోగన్‌ను క్రిస్‌ ఫొటో తీస్తే పిచ్చివాడిలా కేకలు వేస్తూ గెటవుట్‌ అని అరుస్తాడు. ఇంట్లో వారి విచిత్ర ప్రవర్తన చూసి అనుమానంతో వారి ఫొటోలను తన స్నేహితుడికి పంపుతాడు క్రిస్‌. వాటిలో లోగన్‌ను చూసి అతడు కొన్నిరోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆండ్రె అని వ్యక్తి అని, అక్కడేదో ప్రమాదం పొంచి ఉందని చెబుతాడు స్నేహితుడు. దీంతో అక్కణ్నంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు క్రిస్‌. ఆ విషయం పసిగట్టిన రోజ్‌ కుటుంబ సభ్యులు గేట్లు మూసేస్తారు. రోజ్‌ తల్లి మళ్లీ అతణ్ని హిప్నటైజ్‌ చేసి ఇంటి బేస్‌మెంట్‌లో కుర్చీలో బంధిస్తుంది. అక్కడ అతనికి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. రోజ్‌ కుటుంబం తెల్లజాతీయుల మెదళ్లను నల్లజాతీయుల శరీరాల్లోకి ప్రవేశపెడ్తుంటారని, ఇంట్లో ఉన్న పనిమనుషుల శరీరార్లో రోజ్‌ పూర్వీకుల ఆత్మలున్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు క్రిస్‌ శరీరంలోకి అంధుడైన జిమ్‌ మెదడును ప్రవేశపెట్టడానికి చూస్తుంటారు. దాంతో తనకు చూపుతో పాటు క్రిస్‌లోని ఫొటోగ్రఫీ నైపుణ్యం లభిస్తాయని జిమ్‌ ఆశపడ్తుంటాడు. మరి ఆ ఇంటి నుంచి క్రిస్‌ బయటపడ్డాడా? ప్రాణాలు కాపాడుకున్నాడా? అన్నది ‘గెటవుట్‌’లో చూడాలి.
విశేషాలు :
* ర్యాప్‌ సింగర్‌ చాన్స్‌కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఒకరోజు షికాగోలోని అన్ని థియేటర్లలోని అన్ని టికెట్లనూ అతనే కొని జనాలకు ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించాడు.
* తొలి చిత్రంతోనే వంద మిలియన్‌ డాలర్లు వసూళ్లు సాధించిన తొలి నల్లజాతీయుడైన దర్శకుడిగా జోర్డాన్‌ రికార్డు సాధించాడు.

గుడ్డు పెడుతున్న ఇండోనేసియా బాలుడు!

బాలీ: ఇదొక వింత. కోడి గుడ్డును మనిషి పెడుతున్నాడు. అదీ అందరూ చూస్తుండగానే. అసలు ఇది ఎలా జరుగుతోందో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. దక్షిణ ఇండోనేసియాకు చెందిన 14ఏళ్ల అక్మల్‌లో దాగిన మర్మమిదీ..! ఇతడు రెండేళ్లలో 18 గుడ్లు పెట్టాడంటూ అంతర్జాలంలో వార్తలు హల్‌చల్‌చేశాయి. వీటిని అందరూ కొట్టిపారేశారు. అయితే గత సోమవారం తమ ముందే రెండు గుడ్లు పెట్టడంతో వైద్యులు నివ్వెరపోయారు. దీనిలో ఎలాంటి ఇంద్రజాలమూలేదని అక్మల్‌ తండ్రి రుస్లి చెబుతున్నారు. ‘ఇదివరకు అక్మల్‌ పెట్టిన ఓ గుడ్డును పగులగొట్టాను. లోపల అంతా పసుపుపచ్చ సొనే ఉంది. మరొక గుడ్డును అక్మల్‌ తల్లి పగులగొట్టింది. దానిలో పసుపుపచ్చ సొనే లేదు. అంతా తెల్లగా ఉంది. అసలు గుడ్డును అమాంతం ఎప్పుడూ అక్మల్‌ మింగలేదు’అని ఆయన వివరించారు. మరోవైపు అక్మల్‌ గుడ్డును వైద్యులు పరిశీలించారు. ఇవి కోడి గుడ్లలానే ఉన్నట్లు తేల్చారు. ఇవి అతడి కడుపులోకి ఎలా వెళ్లాయనేది అంతుచిక్కడం లేదు. వీటిని కావాలనే మలద్వారం గుండా శరీరంలోకి పంపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ‘మనిషి గుడ్డు పెట్టడం అసాధ్యం. మలద్వారం గుండా అక్మల్‌ వీటిని శరీరంలోకి పంపించి ఉండొచ్చు. ఇది మా అనుమానం మాత్రమే. అతణ్ని వారంపాటు మా పరిశీలనలో ఉంచి పరీక్షలు చేపడతాం. దీంతో నిజానిజాలు తేలిపోతాయి’అని సంబంధిత అసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఇండోనేసియాలో మనిషి గుడ్డుపెట్టాడంటూ వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఉత్తర జకార్తాకు చెందిన కాకెక్‌ సినిన్‌ 2015లోనూ ఇదే విషయంతో వార్తల్లోకెక్కారు.

Tuesday, 20 February 2018

Anti-theft, Stylish, Lots of space, with a external USB charging port. Get your LUGG, the most innovative backpack for the Indian market


.Anti-theft, Stylish, Lots of space, with a external USB charging port. Get your LUGG, the most innovative backpack for the Indian market

MORE DETAILS SEE THE https://goo.gl/FRU3jM
కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు బ్యాక్‌పాక్‌ లేకుండా బయటికి పోలేని స్థితి. అయితే, ఇప్పటి వరకూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాగులన్నింటికీ ముందు భాగంలోనే పలు రకాల జేబులు ఉన్నాయి. దీంతో బ్యాగు తగిలించుకున్నాక వెనక పదే పదే చెక్‌ చేస్తుంటాం. జేబులకు ఉన్న జిప్‌లన్నీ సరిగా ఉన్నాయా... లేదా అని. జన సంద్రంలో దొంగల భయంతో కొన్ని సార్లు వీపునకు తగిలించుకోవాల్సిన బ్యాగుని ముందుకి తగిలించుకుంటాం కూడా. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వస్తువుల్ని భద్రంగా మోసుకెళ్లాలంటే? LUGGబ్యాగు ధరిస్తే సరి. వైవిధ్యమైన డిజైన్‌తో బ్యాగుని తీర్చిదిద్దారు. బ్యాగు ముందు భాగంలో ఒక్క జేబూ కనిపించదు. తగిలించుకున్న బ్యాగు జిప్‌ని ఓపెన్‌ చేయడం ఇతరులకు అసాధ్యం. సామర్థ్యం 20 లీటర్లు. 15 అంగుళాల పరిమాణం ఉన్న ల్యాపీని సులువుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక అర ఉంది. ట్యాబ్లెట్‌, ఐపాడ్‌, మొబైల్‌... లాంటి ఇతర యాక్ససరీస్‌ని పెట్టుకునేందుకు లోపల ప్రత్యేక అరలు ఉన్నాయి. వర్షంలో ‘రెయిన్‌ ప్రూఫ్‌’ కవచంతో బ్యాగుని తడవకుండా కాపాడుకోవచ్చు.LUGG Plusమోడల్‌తో నీళ్ల బాటిల్‌ని పెట్టుకునేందుకు వీలుగా ‘బాటిల్‌ హోల్డర్‌’ని అందిస్తున్నారు. ధర రూ.1,500. ఇతర వివరాలకుhttps://goo.gl/FRU3jM
పవర్‌ బ్యాంకుని బ్యాగులోపల ఏర్పాటు చేసిన యూస్‌బీ పోర్ట్‌కి అనుసంధానం చేసి ఫోన్‌ని ఛార్జ్‌ చేయవచ్చు. అందుకు అనువుగా బ్యాగుకి బయటి పక్క ఎక్స్‌టర్నల్‌ యూఎస్‌బీ పోర్ట్‌ని నిక్షిప్తం చేశారు.


చాహల్‌.. కళ్లజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు?

చాహల్‌.. కళ్లజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 

 భారత మణికట్టు మాంత్రికుడు చాహల్‌ ఈ మధ్య మైదానంలో కళ్ల జోడు పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తున్న సమయంలో పెట్టుకోని చాహల్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో మాత్రమే కళ్ల జోడు ధరిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమిటి? చాహల్‌కు ఏమైఉంటుంది? అన్న అనుమానాలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి. స్టైల్‌గా కనిపించేందుకు కళ్ల జోడు పెట్టుకుంటున్నాడంటూ పలువురు నెట్టింట్లో కామెంట్లు పెట్టారు.

ఐతే.. దీనిపై చాహల్‌ తండ్రి వివరణ ఇచ్చారు.  చాహల్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు కంటికి సంబంధించిన వైద్యులను సంప్రదించాడు. వారు అప్పుడప్పుడు కళ్లజోడు ధరించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు చాహల్‌ కళ్లజోడు ధరిస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే సమయంలో కాకుండా ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు పెట్టుకుంటున్నాడు. త్వరలో చాహల్‌ ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇందులో భాగంగానే కంటి పరీక్షలు చేయించుకున్నాడు’ అని చాహల్‌ తండ్రి తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన అనంతరం చాహల్‌ దిల్లీలో ఐటీ  ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఆయన చెప్పారు.
సఫారీ గడ్డపై భారత పర్యటన ఈ నెల 24తో ముగియనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం రెండో టీ20 జరగనుంది.

Monday, 19 February 2018

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌

 మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో వివాహం చేసుకున్నారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఆయన పెళ్లి చేసుకున్నట్లు ధ్రువీకరించారు. గత కొంతకాలంగా ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాల పెళ్లి విషయంపై వార్తలు వస్తున్నాయి. లాహోర్‌లోని మనేకా సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌదరి తెలిపారు. త్వరలో అతిథులతో సింపుల్‌గా వలీమా డిన్నర్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పీటీఐ సెంట్రల్‌  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ముఫ్తీ ముహమ్మద్‌ సయీద్‌ వారి నిఖా జరిపించారు. పీటీఐ పార్టీకి చెందిన మీడియా విభాగం వారి పెళ్లి ఫొటోను విడుదల చేసింది.
గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నారు. 1995లో బ్రిటిష్‌కు చెందిన బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్లు వీళ్లు కలిసి ఉన్నారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. తర్వాత 2015లో టీవీ యాంకర్‌ రెహామ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరు కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాను జనవరి ఒకటో తేదీన వివాహం చేసుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఖాన్‌ వీటిని ఖండించారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ విషయమై వార్తలు  వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ పుకార్ల ప్రభావం పార్టీపై పడుతోందని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తమ వివాహాన్ని అధికారికంగా తెలియజేయాలని ఇమ్రాన్‌కు పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన మనేకాను వివాహం చేసుకుని అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
 మనేకా వయసు 40కి పైగా ఉంటుంది. ఆమెకు మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మతబోధకురాలు. ఖాన్‌ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు. ఖాన్‌ విషయంలో రాజకీయపరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట. గత నెలలోనే మనేకా తన భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత తాను బుష్రాను పెళ్లి చేసుకుంటానని అడిగానని గత నెలలోనే ఇమ్రాన్‌ వెల్లడించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే పుకార్లు షికార్లు చేశాయి. ఎట్టకేలకు వారి వివాహం జరిగింది.

Sunday, 18 February 2018

ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌ పోస్టుల నోటిఫికేషన్‌ ఒత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ!

ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌  పోస్టుల నోటిఫికేషన్‌ ఒత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ!

మంచి వేతనం.. పని ఒత్తిడి తక్కువ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అదీ పదోతరగతి విద్యార్హతతో.. అలాంటి అవకాశాన్ని మన ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌  పోస్టుల నోటిఫికేషన్‌ ద్వారా కల్పిస్తోంది.
ఏపీ పోస్టల్‌ సర్కిల్లో 245 పోస్టులు
- పోస్టుమెన్‌ 234  - మెయిల్‌ గార్డు 11
పదోతరగతి విద్యార్హతతోనే జీవితంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది తపాలా శాఖ. పోస్టు మెన్‌, మెయిల్‌ గార్డు అంటే ఇవేవో చిన్న ఉద్యోగాలే అనుకోవడం పొరపాటే. ఎందుకంటే కొత్తగా అమల్లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం ఈ రెండు ఉద్యోగాలకూ 21700 మూలవేతనం దక్కుతుంది. దీనికి అదనంగా కరవుభత్యం, ఇంటిఅద్దె భత్యం... మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గ్రామంలో పోస్టింగ్‌ వచ్చినప్పటికీ పాతికవేల రూపాయల నెల జీతం గ్యారెంటీ. అంతేకాకుండా ఒత్తిడి, పనివేళలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనుభవంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఖాళీలను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు. ప్రశ్నలు సైతం పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి రైల్వే ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వీటినీ ప్రయత్నించవచ్చు.
పరీక్ష ఇలా...
వంద మార్కులకు ఆప్టిట్యూడ్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 2 గంటలు.  ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. అవి...
పార్ట్‌ - ఎ: జనరల్‌ నాలెడ్జ్‌, పార్ట్‌ - బి: మ్యాథమేటిక్స్‌
పార్ట్‌ - సి:  ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. విభాగం 1లో ఇంగ్లిష్‌, 2లో తెలుగు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
అర్హత సాధించాలంటే...
పార్ట్‌ ఎ, బిలు కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. అలాగే పార్ట్‌ సిలో రెండు విభాగాలూ కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. ఇలా విభాగాల వారీ మార్కులు సాధించడంతోపాటు మొత్తం ప్రశ్నపత్రం నుంచి ఓసీలు 40, ఓబీసీలు 37, ఎస్సీ, ఎస్టీలు 33 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. అనంతరం అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఎంపికైనవాళ్లు రెండేళ్లు ప్రొబేషన్‌లో కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఉద్యోగంలోకి చేరిన మొదటి నెల నుంచే రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సులూ కలుపుకుని ప్రారంభం నుంచే రూ.25 వేలకు తగ్గకుండా వేతనంగా పొందవచ్చు.
ఖాళీల వివరాలు: పోస్టుమ్యాన్‌ ఖాళీలు విజయవాడ రీజియన్లో 106, కర్నూలులో 60, విశాఖపట్నంలో 68 ఉన్నాయి. మెయిల్‌ గార్డు పోస్టులు విజయవాడ రీజియన్‌లో 6, కర్నూలులో 2, విశాఖపట్నంలో 3 ఉన్నాయి.
అర్హత:  పోస్టుమ్యాన్‌, మెయిల్‌ గార్డు రెండు పోస్టులకూ పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
వయసు 18 - 27 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
నియామకం: పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు .
పరీక్ష కేంద్రాలు:  విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
ఫీజు: అప్లికేషన్‌ ఫీజు రూ.వంద అందరు అభ్యర్థులూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరితేదీ:  మార్చి 15 హెడ్‌ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 16
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20
వెబ్‌సైట్‌: www.appost.in, www.indiapost.in