అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అటు అమెరికాలోను ఇటు ఇతర దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. H1B వీసాలపై ట్రంప్ తీసుకొస్తున్న సంస్కరణలతో ఇబ్బందుల్లోకి పడిపోయాయి పలు టెక్ దిగ్గజ కంపెనీలు. ఇన్ఫోసిస్, విప్రో,టీసీఎస్ లాంటి సంస్థలు ఎక్కువగా H1B వీసాలపై ఆధారపడి తమ ఉద్యోగులను అమెరికాలో పనిచేసేందుకు పంపిస్తున్నాయి. ట్రంప్ తీసుకొస్తున్న సంస్కరణలతో ఆ కంపెనీలపై నీలి ఛాయలు అలుముకుంటున్నాయి.
H1B వీసాల అమలుపై ట్రంప్ డ్రాఫ్ట్ బిల్లును ట్రంప్ ప్రవేశపెట్టారు. ట్రంప్ వీసా సంస్కరణల్లో భాగంగా ఒక ఉద్యోగికి కనీస వేతనం ఏడాదికి లక్షా 30వేల డాలర్లు ఉండాలని నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో రూ.88లక్షల21వేలు ఉండాలి.ఆ లెక్కన నెలకు కనీస వేతనం ఇండియన్ కరెన్సీలో రూ.7లక్షల 35 వేలు ఉండాలి. ఈ వేతనం ఉంటేనే అమెరికాలో పనిచేసేందుకు అర్హులవుతారని ట్రంప్ ప్రవేశపెట్టిన H1B వీసా సంస్కరణలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు H1B వీసాలపై అమెరికాకు వెళ్లిన వారి భర్త లేదా భార్యపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు H1B వీసా కలిగి ఉన్న భార్య కానీ భర్త కానీ అక్కడ ఉద్యోగం చేసుకునే వీలుండేది. అయితే త్వరలో రానున్న కొత్త వీసా సంస్కరణలతో వారి ఉద్యోగాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
కంప్యూటర్‌కు సంబంధించిన ఉద్యోగాల్లో 86శాతం H1B వీసాలు జారీచేస్తుండగా అందులో 46.5 శాతం మంది భారతీయ ఇంజనీర్లు ఉన్నారు. ఎన్నికల సందర్భంలో తన ప్రచారంలో ట్రంప్ అమెరికన్ల ఉద్యోగాలపై పదే పదే మాట్లాడారు. తను అధికారంలోకి వస్తే ముందుగా అమెరికన్లకే ఉద్యోగాలు ఉంటాయని ఆదిశగా వీసాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే ట్రంప్ H1B వీసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అన్ని రంగాలనుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.


No comments:
Post a Comment